సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హిందువులను అవమానించిన ఆలీ.. ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలి

ABN, Publish Date - May 13 , 2026 | 12:35 PM

ఈమధ్యకాలంలో సినీ నటులు సినిమాలు ఉన్నా లేకున్నా యాడ్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. స్టార్ హీరోస్ దగ్గరనుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు అందరూ వాణిజ్య ప్రకటనలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు.

Comedian Ali

ఈమధ్యకాలంలో సినీ నటులు సినిమాలు ఉన్నా లేకున్నా యాడ్స్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. స్టార్ హీరోస్ దగ్గరనుంచి ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు అందరూ వాణిజ్య ప్రకటనలు చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అసలు ఆ ప్రోడక్ట్ ఏంటి.. ? అది నిజమా కాదా.. ప్రజలను మోసం చేస్తున్నామా ఇలాంటివేమీ ఆలోచించకుండా చిక్కుల్లో పడుతున్నారు. ఇంకొంతమంది యాడ్స్ చేసే ముందు స్క్రిప్ట్ ఎలా ఉంది.. ? వివాదమేమైనా అవుతుందా.. ? అనేది ఆలోచించకుండా డబ్బుకోసం చేసేసి ఆ తరువాత ఇబ్బందుల్లో పడుతున్నారు. తాజాగా కమెడియన్ ఆలీ (Ali) కూడా అలాగే ఇబ్బందుల్లో పడ్డాడు.


గతకొంతకాలంగా ఘర్ మ్యాజిక్ సోప్ కి సంబంధించిన యాడ్స్ సోషల్ మీడియాను షేక చేస్తున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేకుండా హీరోలు, హీరోయిన్లు ఈ ఘర్ సోప్ గురించి యాడ్స్ మీద యాడ్స్ చేస్తున్నారు. ఒక్కసారి రుద్దితే నల్లగా ఉన్నవారు కూడా తెల్లగా మారిపోతారని, ఒక్కసారి వాడి చూడండి అంటూ ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. అలా చెప్పినా ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదు.. కానీ, ఆలీ ఈ సోప్ కి ఎలివేషన్ ఇవ్వడానికి లక్ష్మీస్తోత్రంను వాడి హిందువుల మనోభావాలను దెబ్బతీశాడు.


దేవుడు చేసిన మనుషులు సినిమాలో ఆలీ.. లక్ష్మీదేవికి పూజ చేసే సీన్ ని రీక్రియేట్ చేశాడు. సబ్బుకు లక్ష్మీ పూజ చేస్తూ కనిపించాడు. సబ్బుకు లక్ష్మీ పూజ చేస్తున్నా ఏంటి అనుకుంటున్నారా.. ? అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే పెద్ద వివాదానికి దారితీసింది. సబ్బుకు లక్ష్మీ పూజ చేయడమేంటి అంటూ హిందూ సంఘాలు మండిపడ్డాయి. వెంటనే ఆ యాడ్ ని డిలీట్ చేయాలని డిమాండ్ చేశాయి. అంతేకాకుండా ఆలీని ఇండస్ట్రీ నుంచి బ్యాన్ చేయాలనీ ఫైర్ అయ్యాయి. దీంతో తప్పు తెలుసుకున్న ఆలీ.. హిందూ సంఘాలకు క్షమాపణ చెప్పాడు. ' ఘర్ సోప్ యాడ్.. దేవుడు చేసిన మనుషులు సినిమాలో నేనే చేశాను. బొంబాయి కంపెనీ వాళ్ళు చేయమన్నారు. అందుకే చేశాను. కానీ, చాలామంది బాలేదు సార్ .. ఇబ్బందిగా ఉంది. త్వరగా డిలీట్ చేయండి అని చెప్పారు. నేను డిలీట్ చేసేశాను. ఎవరికైనా బాధ కలిగిఉంటే మనస్ఫూర్తిగా క్షమిస్తారని కోరుకుంటున్నాను' అంటూ తెలిపాడు. మరి ఈ క్షమాపణపై హిందూ సంఘాలు ఏమంటాయో చూడాలి.

Updated Date - May 13 , 2026 | 12:53 PM