సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Swathi Reddy: పెళ్ళి చేసుకోవడం కన్నా కుక్కను పెంచుకోవడం బెటర్..

ABN, Publish Date - May 24 , 2026 | 04:36 PM

సోషల్ మీడియా వచ్చాకా ఎవరిని, ఎందుకు, ఎప్పుడు వైరల్ చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ఏదో ఒక సెలబ్రిటీ ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో చేసిన కొన్ని వ్యాఖ్యలను తీసుకొని అవసరం లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. దానిపై డిబేట్ లు పెడుతున్నారు.

Colors Swathi

సోషల్ మీడియా వచ్చాకా ఎవరిని, ఎందుకు, ఎప్పుడు వైరల్ చేస్తున్నారో అర్ధం కావడం లేదు. ఏదో ఒక సెలబ్రిటీ ఎప్పుడో ఒక ఇంటర్వ్యూలో చేసిన కొన్ని వ్యాఖ్యలను తీసుకొని అవసరం లేకుండా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. దానిపై డిబేట్ లు పెడుతున్నారు. సోషల్ మీడియా లేని సమయంలో ఆ సెలబ్రిటీలు చేసిన వ్యాఖ్యలను మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి వారిపై దుమ్మెత్తిపోస్తున్నారు. తాజాగా హీరోయిన్ స్వాతి రెడ్డి (Swathi Reddy) గతంలో పెళ్ళిపై చేసిన వ్యాఖ్యలను మరోసారి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.


యాంకర్ గా కెరీర్ ని మొదలుపెట్టి అష్టాచమ్మా సినిమాతో హీరోయిన్ గా మారింది స్వాతి రెడ్డి. తనదైన చమత్కారం, స్పష్టమైన మాటలతో అందరినీ ఆకట్టుకునే స్వాతి.. గతంలో వివాహం, రిలేషన్‌షిప్స్ గురించి చేసిన కొన్ని బోల్డ్ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్ళీ వైరల్‌గా మారాయి. ఒక ఇంటర్వ్యూలో స్వాతి వివాహం గురించి మాట్లాడుతూ.. పెళ్ళి కన్నా కుక్కను పెంచుకోవడం బెటర్ అని చెప్పుకొచ్చింది. 'ఈ రోజుల్లో ఒక మనిషిని నమ్మి, పెళ్ళి చేసుకుని జీవితాంతం కలిసి ఉండటం చాలా కష్టమైన విషయంగా మారిపోయింది. ఎవరికీ ఓపిక ఉండడం లేదు. అందుకే, ఎవరినోపెళ్ళి చేసుకొనిప్రతిరోజూ మానసిక ప్రశాంతతను కోల్పోవడం కన్నా.. హాయిగా ఒక కుక్కను పెంచుకోవడం చాలా బెటర్. అది మనకు ఎప్పుడూ నమ్మకంగా ఉంటుంది, ఎలాంటి కండిషన్లు లేకుండా మనల్ని ప్రేమిస్తుంది' అని తెలిపింది.


2014 లో జరిగిన ఒక ఇంటర్వ్యూలో స్వాతి ఈ వ్యాఖ్యలు చేసింది. అప్పటికీ ఆమెకు పెళ్ళి కాలేదు. ఆ తరువాత 2018 లో వికాస్ అనే పైలట్‌ను వివాహం చేసుకున్న స్వాతి, పెళ్ళైన కొన్నాళ్లకే కొన్ని మనస్పర్థల కారణంగా అతనికి దూరమయ్యింది ఆ తర్వాత వారు విడాకులు తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అయ్యేసరికి చాలామంది స్వాతిని విమర్శిస్తున్నారు. కుక్కనే బెటర్ అన్నప్పుడు నువ్వెందుకు పెళ్ళి చేసుకున్నావ్.. ఎందుకు విడిపోయావ్ అని కొందరు.. కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె చెప్పింది కూడా నిజమే అని చెప్తున్నారు. అసలు ఇన్నేళ్ళ తరువాత స్వాతి రెడ్డి వ్యాఖ్యలు వైరల్ ఎందుకు చేశారు అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - May 24 , 2026 | 04:57 PM