సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అల్లు అర‌వింద్ ఇంటికి సీఎం చంద్ర‌బాబు.. శిరీష్ దంప‌తుల‌కు ఆశీర్వాదం

ABN, Publish Date - Mar 15 , 2026 | 09:38 AM

అల్లు అరవింద్ కుమారుడు అల్లు శిరీష్, న‌య‌నికా రెడ్డి వివాహాం ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే.

Allu Sirish

అల్లు అరవింద్ (Allu Aravind) కుమారుడు అల్లు శిరీష్ (Allu Sirish), న‌య‌నికా రెడ్డి (Nayanika Reddy) ల వివాహాం ఇటీవ‌ల హైద‌రాబాద్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ వేడుకకు సినీ, రాజ‌కీయ నాయ‌క‌లు భారీగా విచ్చేసి నూత‌న దంప‌తుల‌ను అశీర్వ‌దించారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఈ వేడుకకు హ‌జ‌రయ్యారు. అయితే ఆ స‌మ‌యంలో వివిధ ప‌నులో బిజీగా ఉన్న ఆంధ్ర ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు (Chandrababu Naidu) ఈ వేడుక‌కు హ‌జ‌రు కాలేక పోయారు.

ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు శ‌నివారం సాయంత్రం అల్లు అర‌వింద్ ఇంటికి స్వ‌యంగా వెళ్లి నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించారు. పూల బోకే ఇచ్చి శుభాకాంక్ష‌లు తెలిపారు.

అనంత‌రం అక్క‌డే కాసేపు ఉండి అర‌వింద్ కుటుంబ స‌భ్య‌లతో గ‌డిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్య‌మాల్లో హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ఈ సంద‌ర్భంగా అల్లు ఫ్యామిలీ సీఎం చంద్ర‌బాబు నాయుడుకి శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి ప్ర‌తిమ‌ను బ‌హూక‌రించారు.

Updated Date - Mar 15 , 2026 | 01:38 PM