సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

నా వెంట్రుక కూడా పీకలేరు.. యశ్ మాస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్

ABN, Publish Date - Sep 09 , 2026 | 09:38 PM

సినీ పరిశ్రమ అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ప్రశంసలు కురిపించినవారే క్షణాల్లో విమర్శల రాళ్లు కూడా విసురుతుంటారు. ప్రస్తుతం ప్రముఖ కొరియోగ్రాఫర్, 'ఢీ' డ్యాన్స్ షో ఫేమ్ యశ్వంత్ మాస్టర్ (యశ్) సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు.

Yash

సినీ పరిశ్రమ అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ప్రశంసలు కురిపించినవారే క్షణాల్లో విమర్శల రాళ్లు కూడా విసురుతుంటారు. ప్రస్తుతం ప్రముఖ కొరియోగ్రాఫర్, 'ఢీ' డ్యాన్స్ షో ఫేమ్ యశ్వంత్ మాస్టర్ (యశ్) (Yash Master) సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాడు. బుల్లితెరపై 'ఢీ' విజేతగా నిలిచి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యశ్, ప్రస్తుతం ఒకవైపు వెండితెర సినిమాలకు, మరొకవైపు టీవీ షోలకు కొరియోగ్రఫీ చేస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నాడు.


అయితే గత కొన్నిరోజులుగా యశ్ డ్యాన్స్ స్టైల్‌పై సోషల్ మీడియాలో నెగెటివ్ ప్రచారం మొదలైంది. ఆయన చేసేది అసలు డ్యాన్సే కాదని, కేవలం జిమ్నాస్టిక్స్ లేదా మెథడ్ యాక్టింగ్ చేస్తున్నట్లు ఉంటుందని కొందరు విమర్శిస్తున్నారు. అంతేకాకుండా, ఆయన డ్యాన్స్ వీడియోలను మీమ్ కంటెంట్‌గా మారుస్తూ 'ఢీ' షోలో ఇతడిని సూపర్ డ్యాన్సర్ ఎలా చేశారంటూ రకరకాలుగా ట్రోల్ చేయడం ప్రారంభించారు.


ఈ ట్రోల్స్ మరియు నెగెటివిటీపై యశ్ మాస్టర్ తీవ్రంగా స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా ట్రోలర్లకు గట్టి హెచ్చరిక జారీ చేశాడు. శ్రీకాంత్ ఓదెల-నాని కాంబినేషన్‌లో వస్తున్న 'ప్యారడైజ్' సినిమాలోని నాని జడల ఫొటోను షేర్ చేస్తూ.. 'మీరు ఎంత నెగిటివిటీ స్ప్రెడ్ చేసినా నా వెంట్రుక కూడా పీకలేరు' అంటూ ఘాటుగా రాసుకొచ్చాడు. తాను ఈ స్థాయికి రావడానికి పడిన కష్టాన్ని గుర్తుచేసుకుంటూ, తన గురించి పలువురు పాజిటివ్‌గా మాట్లాడిన వీడియోలను షేర్ చేసి, ఇదీ నా విజయం అని సమాధానమిచ్చాడు.


యశ్ చేసిన ఈ పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కొందరు నెటిజన్లు కావాలనే యశ్ మాస్టర్‌ను టార్గెట్ చేసి ట్రోల్ చేస్తున్నారని మద్దతుగా నిలుస్తుండగా, మరికొందరు మాత్రం ఇలాంటి సోషల్ మీడియా నెగెటివిటీని పట్టించుకోకుండా, కొరియోగ్రఫీలో మంచి విజయాలు సాధించి వాళ్లకు సమాధానం చెప్పాలని సూచిస్తున్నారు.

Updated Date - Sep 09 , 2026 | 09:40 PM