కారు ప్రమాదం.. స్పందించిన శేఖర్ మాస్టర్
ABN, Publish Date - Nov 12 , 2026 | 03:27 PM
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar Master) ప్రయాణిస్తున్న కారుకు తృటిలో పెను ప్రమాదం తప్పిన విషయం తెల్సిందే. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న కాకా(Kaaka) సినిమాలోని సాంగ్ షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా శంషాబాద్ - ముచ్చింతల్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ (Sekhar Master) ప్రయాణిస్తున్న కారుకు తృటిలో పెను ప్రమాదం తప్పిన విషయం తెల్సిందే. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న కాకా(Kaaka) సినిమాలోని సాంగ్ షూటింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా శంషాబాద్ - ముచ్చింతల్ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వెనుక నుంచి అతివేగంగా పండ్ల లోడ్‌తో దూసుకొచ్చిన ఒక లారీ శేఖర్ మాస్టర్ కారును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు కారు వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది.
అయితే అదృష్టవశాత్తూ ఆ సమయంలో కారులో శేఖర్ మాస్టర్‌తో పాటు ఉన్న నలుగురు వ్యక్తులు ఎవరికీ ఎలాంటి పెద్ద గాయాలు కాకుండా సురక్షితంగా బయటపడ్డారు. నిన్ననే అయ్యప్ప స్వామి మాల ధరించిన శేఖర్ మాస్టర్.. స్వామి ఆశీస్సులతోనే పెను ముప్పు నుంచి బయటపడ్డామని భావోద్వేగంతో స్పందించారు. ' స్వామి శరణం.. కాకా సాంగ్ షూటింగ్ ని ముగించుకొని తిరిగి వస్తుంటే తెల్లవారుజామున 6 గంటలకు కారు యాక్సిడెంట్ కి గురైంది.కారు వెనక భాగం పూర్తిగా దెబ్బతింది. ఆ సమయంలో కారులో మేము నలుగురం ఉన్నాం.. అయ్యప్ప దయ వల్లే మాకు ఏమీ జరగలేదు. అందరూ నాకు ఏమైందో అని మెసేజ్ లు చేస్తున్నారు. నేను క్షేమంగా ఉన్నాను. మాతో పాటు ఉన్నవారు కూడా క్షేమంగా ఉన్నారు. ఈరోజు రాత్రికి కూడా షూటింగ్ ఉంది. దానికి బయల్దేరుతున్నాను" అని చెప్పుకొచ్చాడు.
ప్రమాద వార్త తెలిసిన వెంటనే సినీ ప్రముఖులు, కొరియోగ్రాఫర్లు, అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే శేఖర్ మాస్టర్ క్షేమంగా ఉన్నారని, తదుపరి షూటింగ్ పనుల్లో కూడా పాల్గొంటున్నారని తెలిసి అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన కారు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అభిమానులు ఆయనకు స్వామి రక్ష ఉందని కామెంట్లు చేస్తున్నారు.