‘చోర శిఖామణులు’కు సపోర్ట్ చేసింది వీరే..
ABN , Publish Date - Jul 12 , 2026 | 08:32 PM
శ్రీకరి - వివాన్ సమర్పణలో.. శ్రీకరి క్రియేషన్స్ బ్యానర్ పై బానూరు నాగరాజు నిర్మిస్తోన్న చిత్రం ‘చోర శిఖామణులు’. ఆనంద్ కుర్మా ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.
శ్రీకరి - వివాన్ సమర్పణలో.. శ్రీకరి క్రియేషన్స్ బ్యానర్ పై బానూరు నాగరాజు (Banuru Nagaraju) నిర్మిస్తోన్న చిత్రం ‘చోర శిఖామణులు’ (Chora Shikamanulu). ఆనంద్ కుర్మా (Anand Kurma) ఈ చిత్రానికి కథ, కథనం, మాటలు, దర్శకత్వ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. యాక్షన్, క్రైమ్, కామెడీ జానర్‌లో రూపుదిద్దుకోనున్న ఈ మూవీలో రామ్ తేజ్, జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్, నరేష్, అజయ్ ఘోష్, సంపూర్ణేష్ బాబు, మురళీధర్ గౌడ్, జబర్దస్త్ సత్య శ్రీ వంటివారు ముఖ్య పాత్రలను పోషించనున్నారు. తాజాగా ఈ చిత్ర ప్రారంభోత్సవం పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా జరిగింది.
ఈ పూజా కార్యక్రమాలకు త్రినాథరావు నక్కిన, దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై యూనిట్‌కు సపోర్ట్ అందించారు. ముహూర్తపు సన్నివేశానికి దామోదర ప్రసాద్, ప్రసన్న కుమార్, త్రినాథరావు నక్కిన స్క్రిప్ట్ అందించగా.. తొలి సన్నివేశానికి త్రినాథరావు నక్కిన గౌరవ దర్శకత్వం వహించారు. ఈ మూవీకి ఆనంద్ రాజా విక్రమ్ సంగీత దర్శకుడిగా, జగదీష్ కొమరి కెమెరామెన్‌గా, యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా డ్రాగన్ ప్రకాష్ ఎంపికయ్యారు.
జూలై 25 నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ ఈ అప్డేట్‌తో తెలిపారు. మంచి సాంగ్‌తో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని టీమ్ తెలిపింది. సినిమాకు ఇతర వివరాలను, అలాగే అప్డేట్స్‌ను త్వరలోనే తెలియజేస్తామని, ఈ సినిమాకు అద్భుతమైన కథ కుదిరిందని, కచ్చితంగా మంచి హిట్ చిత్రం అవుతుందని ఈ చిత్రంగా చిత్ర దర్శకనిర్మాతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
నేనెంత దురదృష్టవంతురాలినో మాటల్లో చెప్పలేను: కౌసల్య
విజయ్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్! ‘జననాయగన్’ మళ్లీ వాయిదా..
శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ టీమ్స్ మధ్య ఘర్షణ.. సభ్యుల విజ్ఞప్తి ఇదే