సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Nag Ashwin: సింగ్ గీతం.. వెన‌క పెద్ద క‌థే ఉంది

ABN, Publish Date - Jun 07 , 2026 | 01:37 PM

దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 94 ఏళ్ల వయసులో ‘సింగ్‌ గీతం’ అనే వైవిధ్యమైన మ్యూజికల్‌ చిత్రాన్ని తెరకెక్కించారు.

దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 9Singeetham Srinivasarao) 94 ఏళ్ల వయసులో ‘సింగ్‌ గీతం’ (Sing geetham)అనే వైవిధ్యమైన మ్యూజికల్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. సుప్రసిద్ధ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ (Nag ashwin)దీని నిర్మాత. ఒక అద్భుతమైన కథకు మాటలు లేకుండా కేవలం పాటలతోనే రూపకల్పన చేసిన ఈ సినిమా విశేషాలను, సింగీతం శ్రీనివాసరావుతో తనకున్న అనుభవాలను నాగ్‌ అశ్విన్‌ ‘నవ్య’తో పంచుకున్నారు. ఆ ఆసక్తికరమైన ముచ్చట్లు మీ కోసం...

ఈ సినిమా కోసం చాలా కష్టపడినట్టు తెలుస్తోంది.. షూటింగ్‌ అనుభవాలు చెప్పండి?

నార్మల్‌గా వెళ్లి ఒక సీన్‌ షూట్‌ చేసి అక్కడ ఇంప్రవైజ్‌ చేయడం ఈ సినిమాకు చాలా కష్టం. ఎందుకంటే ఇదొక మ్యూజికల్‌ ఫిల్మ్‌. అందుకే సింగీతం సర్‌తో కూర్చుని.. ఆయన ఏం అనుకున్నారో ప్రతి సీన్‌ను ముందే పక్కాగా ప్లాన్‌ చేసుకుని.. ఇంప్రవైజ్‌ చేసుకునే సెట్‌కు వెళ్లాలి. అన్నింటికంటే ముఖ్యంగా ఇందులో కొన్ని లాజిస్టిక్స్‌ ఛాలెంజెస్‌ ఉన్నాయి. ఆయనకు (సింగీతం)కు ఇప్పుడు 94 ఏళ్లు. ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు. ప్రతిసారీ ఇక్కడకు రాలేరు. అందుకని మేము ఒక ఆన్‌లైన్‌ సిస్టంను క్రియేట్‌ చేశాం. ఆయన చెన్నై నుంచే మానిటర్‌ చేస్తూ.. టాక్‌బోర్డు ద్వారా ఇక్కడి కెమెరామన్‌తో మాట్లాడేవారు. అలా చాలా రోజులపాటు ‘వర్చువల్‌ డైరెక్షన్‌’ ద్వారా ఈ సినిమాను పూర్తిచేశాం.

టెక్నాలజీ మీకు గ్రేట్‌ అడ్వాంటేజ్‌ అన్నమాట?

అవును.. డెఫినెట్లీ! ఇలాంటి ప్రయోగాత్మక సినిమాకు టెక్నాలజీ ఫుల్‌ అడ్వాంటేజ్‌ అయింది. చాలా బాగా హెల్ప్‌ అయింది.

ఇది మాటలు లేని కంటిన్యూస్‌ థీమ్‌ కదా.. దీనికోసం వర్క్‌షాప్స్‌ నిర్వహించారా?

చాలా చేశాం. సినిమా షూటింగ్‌ మొదలుపెట్టడానికి ముందు ఐదారు నెలలపాటు వర్క్‌షాప్స్‌, రిహార్సల్స్‌ నిర్వహించాం.


సినిమా బేసిక్‌ స్టోరీ ఎలా ఉండబోతోంది?

ఈ స్టోరీ చాలా యంగ్‌గా, సినిమా పేసింగ్‌ చాలా వేగంగా ఉంది. సినిమా నిడివి 2 గంటల 10 నిమిషాలు మాత్రమే. కానీ సినిమా చూస్తున్నప్పుడు చాలా త్వరగా అయిపోయిందనే భావన కలుగుతుంది. 94 ఏళ్ల వయసున్న ఒక సీనియర్‌ డైరెక్టర్‌, బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాలం నుంచి వచ్చిన ఒక వ్యక్తి సినిమా తీస్తే ఎలా ఉంటుందో అనే సందేహం.. ఇన్‌స్టా రీల్స్‌ చూసే ఇప్పటి తరానికి అస్సలు రాదు. ముందుగా సింగీతం సర్‌ మానసికంగా ఎక్స్‌ట్రీమ్లీ అప్‌డేటెడ్‌. రెండోది.. ఈ సినిమాకు పనిచేసిన టీం అంతా చాలా యంగ్‌, అందరూ కొత్తవాళ్లు. సో సినిమా ఫీల్‌ అంతా చాలా అప్‌డేటెడ్‌గా ఉంటుంది. సింగీతం సర్‌ మాటల్లో చెప్పాలంటే.. ఒక 16 ఏళ్ల కుర్రాడు తీసినట్టుగా ఉంటుందీ సినిమా.

ఇందులో నిర్మాతగా మీ ఇన్వాల్వ్‌మెంట్‌ ఎంత?

నేను ఈ సినిమాలో అసిస్టెంట్‌ డైరెక్టర్‌గానో, రైటర్‌గానో, సెట్‌ డిజైన్‌ లేదా వీఎ్‌ఫఎక్స్‌లో హెల్ప్‌ చేయడానికో.. ఇలా ప్రతి స్టేజ్‌లో నా వంతుగా ఏ విధంగా హెల్ప్‌ఫుల్‌ కాగలనో అలా అన్నింట్లో ఉన్నాను. కానీ నా ఏకైక అజెండా ఒక్కటే. సార్‌ (సింగీతం శ్రీనివాసరావు)విజన్‌ ఎ లా ఉందో.. అది అలాగే స్ర్కీన్‌పైకి రావాలి. ఫైనల్‌ వర్డ్‌ ఎప్పుడూ ఆయనదే. నా పనల్లా ఆయన ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకుని అది జరిగేలా చూడటమే.

ఇలాంటి ఒక డిఫరెంట్‌ ప్రయోగం చేస్తున్నారని తెలిసినప్పుడు మీ టీం రియాక్షన్‌ ఏంటి?

వాళ్లకు అది అలవాటే. నేను ఇలాంటి ‘ఇంపాజిబుల్‌ థింగ్స్‌’ (అసాధ్యమైన పనులు) చేస్తూ ఉంటానని వాళ్లకు ముందే తెలుసు. సో, వాళ్లేమీ సర్‌ప్రైజ్‌ కాలేదు. ‘ఓహో.. మళ్లీ ఏదో కొత్తది తీసుకొచ్చారా, సరే చేద్దాం పదండి’ అన్నట్టుగా లైట్‌ తీసుకున్నారు.

ఈ ప్రాజెక్ట్‌లో మీరు పూర్తిగా మునిగి పోయినట్టు ఉన్నారు.

అవునండీ.. రాబోయే నాలుగైదు రోజుల్లో సినిమా రిలీజ్‌ అయ్యేంత వరకు పూర్తిగా దీనిపైనే ఉంటాం.


ఇంతటి ఎక్స్‌ట్రీమ్‌ క్రియేటివ్‌ ఎన్విరాన్‌మెంట్‌లో పనిచేసేటప్పుడు ఒత్తిడి ఉంటుంది కదా.. మీ ఎమోషనల్‌ సపోర్ట్‌ ఎవరు?

ఒత్తిడి డెఫినెట్‌గా ఉంటుంది. కానీ సింగీతం లాంటి లెజెండ్‌తో కలిసి పనిచేస్తున్నామనే ఆనందం ముందు ఆ స్ట్రెస్‌ తెలియదు. ఇది చాలా స్పెషల్‌ ప్రాజెక్ట్‌. ఎలా చేయాలి? కొత్తగా ఎలా చూపించాలి అనే ఒత్తిడి ఉన్నా.. సింగీతం సర్‌తో సినిమా చేస్తున్నాం అని గుర్తు చేసుకుంటే పడుతున్న కష్టమంతా ‘వర్త్‌ ఇట్‌’ అనిపిస్తుంది.

బడ్జెట్‌ పరంగా అంతా కంట్రోల్‌లోనే ఉందా?

కంట్రోల్‌ అంటే.. ఈ సినిమాకు సంబంధించి కథ, సెటప్స్‌, విఎఫ్ఎక్స్‌ అంతా భారీగానే ఉంటాయి. మూడు నాలుగు లొకేషన్లలో చిన్నగా చేసిన ప్రయోగం కాదు. ఇందులో ఒక పెద్ద ఊరు.. దానికి సంబంధించి భారీ సెటప్‌, గోల్డ్‌ మైన్స్‌ ఉన్నాయి. ప్రతి రోజు సెట్‌లో ఒక వందమంది ఉండేవారు. సినిమా కథకు ఏం కావాలో, అది దేనికి అర్హమైనదో దానికి తగ్గట్టుగా బడ్జెట్‌ విషయంలో రాజీ పడకుండా పెద్ద స్థాయిలోనే చేశాం. కథ డిమాండ్‌ మేరకు బడ్జెట్‌ ఎక్కువగానే అయింది.

సినిమా రష్‌ ఏమైనా చూశారా?

నాన్‌స్టాప్‌గా చూస్తూనే ఉన్నాం. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది. ఇట్స్‌ లుకింగ్‌ వెరీగుడ్‌. వెరీ ఫన్‌ బేసికల్లీ. ఎలాంటి కన్ఫ్యూజన్‌ లేకుండా హ్యాపీగా థియేటర్లో కూర్చుని చూసేలా ఉంటుంది.

మీ సినిమాల్లో తెలుగు భాషకు, డిక్షన్‌కు, డైలాగ్స్‌కు ప్రాధాన్యం ఇస్తారు. కానీ ఇదొక మాటలు లేని సినిమా కదా.. కేవలం పాటలతోనే భావాన్ని పండించడం కష్టం కాదా?

నిజంగానే చాలా కష్టం. కానీ, అవుట్‌పుట్‌ మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ కథను, స్క్రిప్టును  సిద్ధం చేసిన విధానం చాలా బాగుంది. రాసినవాళ్లు చాలా గ్రేట్‌ జాబ్‌ చేశారు.

 

Updated Date - Jun 07 , 2026 | 01:50 PM