సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mahima Nambiar: ‘కామ్రేడ్ కళ్యాణ్’పై మహిమా నంబియార్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, Publish Date - Oct 05 , 2026 | 09:00 PM

కామ్రేడ్ కళ్యాణ్’ నా తొలి తెలుగు సినిమా. 90ల బ్యాక్‌డ్రాప్, కామెడీ, ఎమోషన్స్‌తో కథ చాలా ఫ్రెష్‌గా అనిపించింది. శ్రీ విష్ణు సిగ్నేచర్‌ స్టైల్‌లో సాగే ఈ సినిమా నాకు మంచి అనుభవాన్ని ఇచ్చింది.

''కామ్రేడ్ కళ్యాణ్’ నా తొలి తెలుగు సినిమా. 90ల బ్యాక్‌డ్రాప్, కామెడీ, ఎమోషన్స్‌తో కథ చాలా ఫ్రెష్‌గా అనిపించింది. శ్రీ విష్ణు సిగ్నేచర్‌ స్టైల్‌లో సాగే ఈ సినిమా నాకు మంచి అనుభవాన్ని ఇచ్చింది. ఈ చిత్రంతో తెలుగులో డెబ్యూ చేయడం లక్కీగా ఫీలవుతున్నాను” అని హీరోయిన్ మహిమా నంబియార్ అన్నారు.

శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న పీరియడ్ ఎంటర్‌టైనర్‌ ‘కామ్రేడ్ కళ్యాణ్’. జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో  మహిమా నంబియార్ కథానాయికగా నటించారు. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మహిమ సినిమా విశేషాలను ముచ్చటించారు. 

  • కామ్రేడ్ కళ్యాణ్’ నా తొలి తెలుగు చిత్రం. ఇందులో సితార దేవి అనే పాత్రలో కనిపిస్తాను. అమాయకంగా, పక్కింటి అమ్మాయిలా ఉండే క్యారెక్టర్ ఇది. ఒడిశా నుంచి వచ్చిన అమ్మాయిగా కనిపిస్తాను. ఒడిశాలో షూటింగ్ చేయడం కూడా నాకు కొత్త అనుభవం. సినిమాలోని ‘ఒడియా పిల్లా’ పాటకు మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు అర్థమవుతుంది. ప్రతి డైలాగ్‌ను దర్శకుడిని అడిగి తెలుసుకుని నటించాను. అది నా పాత్రను మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడింది.

  • నేను చేసిన తమిళ, మలయాళ సినిమాలను చూసిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల నాకు ఫోన్ చేసి ఈ కథ చెప్పారు. కథ నాకు చాలా నచ్చింది. శ్రీ విష్ణు సిగ్నేచర్ స్టైల్‌లో మంచి ఫన్ ఎంటర్‌టైనర్‌గా సినిమా ఉంటుంది. ముఖ్యంగా 90ల బ్యాక్‌డ్రాప్ నాకు చాలా ఫ్రెష్‌గా అనిపించింది. ఇందులో నక్సలిజం నేపథ్యం ఉన్నప్పటికీ దాన్ని చాలా వినోదాత్మకంగా చూపించారు. మంచి కమర్షియల్ ప్యాకేజ్‌గా ఈ సినిమా ఉంటుంది.

  • గతంలో శ్రీ విష్ణుతో ‘సామజవరగమన’ సినిమా చేయాల్సి వచ్చింది. ఆ సినిమా కోసం ఫొటోషూట్ కూడా జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేకపోయాను. ఇప్పుడు ‘కామ్రేడ్ కళ్యాణ్’తో ఆయనతో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన చాలా స్పాంటేనిటీ ఉన్న నటుడు. షూటింగ్ సమయంలో సన్నివేశానికి తగ్గట్టుగా ఇంప్రొవైజ్ చేస్తుంటారు. అది నాకు కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించినా, ఆయనతో కలిసి నటించడం ద్వారా చాలా నేర్చుకున్నాను. ఆయనకు ఒక ప్రత్యేకమైన సిగ్నేచర్ స్టైల్ ఉంది. ఆయన సినిమాల్లో ‘బ్రోచేవారెవరురా’ నాకు చాలా ఇష్టం. ‘స్వాగ్’ కూడా చూశాను. 

  • తెలుగు ప్రేక్షకులు సినిమాలను చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. మంచి కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా ఆదరిస్తారు. ఒక నటిగా నాకు అన్ని రకాల పాత్రలు చేయాలని ఉంది. నేను న్యాయం చేయగలిగే ప్రతి విభిన్నమైన పాత్రను ప్రయత్నించాలనుకుంటున్నాను. ప్రస్తుతం తమిళం, మలయాళంలో ఒక్కో సినిమా చేస్తున్నాను. తెలుగులో కూడా మంచి కథలు వింటున్నాను.

Updated Date - Oct 05 , 2026 | 09:02 PM