సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మెగా 158: షూటింగ్‌కు ముహూర్తం కుదిరింది..

ABN, Publish Date - Mar 29 , 2026 | 02:31 PM

‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi)తదుపరి చిత్రంపై దృష్టి పెట్టనున్నారు. ఇప్పుడు ‘మెగా 158’ సినిమా కోసం సిద్ధమవుతున్నారు.

‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi)తదుపరి చిత్రంపై దృష్టి పెట్టనున్నారు. ఇప్పుడు ‘మెగా 158’ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. కె.ఎస్‌.రవీంద్ర (KS ravindra-బాబీ) ఈ చిత్రానికి దర్శకుడు. ఏప్రిల్‌ మూడో వారం నుంచి ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఏప్రిల్‌ 20 నుంచి ఈ చిత్రాన్ని ట్రాక్‌ ఎక్కించేందుకు మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్‌ పనులు పూర్తయ్యాయి. ఇతర నటీనటుల ఎంపికపై కసరత్తులు జరుగుతున్నాయి. షూటింగ్‌ మొదలయ్యే సమయానికి ఆర్టిస్ట్‌ల ఎంపిక పూర్తవుతుంది. (mega 158)

బెంగాల్‌ నేపథ్యంలో తండ్రీ కూతుళ్ల సెంటిమెంట్‌తో యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇందులో చిరంజీవికి భార్యగా ప్రియమణి, కూతురిగా కన్నప్ప ఫేం ప్రీతి ముకుందన్‌ ఫైనల్‌ అయినట్లు టాక్‌ నడుస్తోంది. కృతి శెట్టి, అనస్వర రాజన్‌ పేర్లు వినిపించినా చివరకు ప్రీతినే మెగాస్టార్‌ కూతురి రోల్‌ కోసం ఎంపిక చేశారట. సినిమాకు ఎంతో కీలకమైన పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ కనిపించనున్నట్లు సమాచారం. ఇద్దరు స్టార్‌ హీరోలు ఈ చిత్రంలో కనిపించనుండటంతో థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. అలాగే బాలీవుడ్‌ యాక్టర్‌ అనురాగ్‌ కశ్యప్‌ విలన్‌ రోల్‌గా కనిపించనున్నారట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోనే సినిమాను విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

Updated Date - Mar 29 , 2026 | 02:31 PM