Chiranjeevi: జాతీయ పురస్కార గ్రహీతలకు చిరు అభినందనలు
ABN, Publish Date - Jul 19 , 2026 | 03:24 PM
72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలందరికీ మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
72వ జాతీయ చలనచిత్ర అవార్డుల (National awards) విజేతలందరికీ మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. భారతీయ సినిమా మరింత అభివృద్ధి చెందుతూ, భావితరాలకు స్ఫూర్తిగా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా దేశానికి మరింత కీర్తి తీసుకురావాలని చిరంజీవి ఆకాంక్షించారు. 'పుష్ప 2' (Pushpa 2) చిత్రానికి ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో జాతీయ అవార్డు అందుకున్న దర్శకుడు సుకుమార్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అలాగే, ప్రముఖ నటుడు మమ్ముట్టి (mammotty) నాలుగోసారి ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోవడం అసాధారణమైన ఘనత అని కొనియాడారు.
ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు దక్కించుకున్న 'కమిటీ కుర్రోళ్లు' చిత్రబృందానికి, ముఖ్యంగా నిర్మాత నిహారిక కొణిదెలకు అభినందనలు తెలియజేశారు. తెలుగు సినిమాకు ఇది గర్వకారణమని పేర్కొన్నారు. 'కల్కి 2898 AD' చిత్రానికి ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డు రావడం దర్శకుడు నాగ్ అశ్విన్ సృజనాత్మక దృష్టికి దక్కిన గొప్ప గుర్తింపని చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా వైజయంతి మూవీస్ సంస్థకు కూడా శుభాకాంక్షలు తెలిపారు. '35' చిత్రం ఉత్తమ బాలల చిత్రంగా ఎంపిక కావడం, ఆ చిత్రంలోని అరుణ్ దేవ్ ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. 'లక్కీ భాస్కర్' చిత్రానికి ఉత్తమ సంభాషణల రచయితగా అవార్డు అందుకున్న వెంకీ అట్లూరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలిపారు.దేశం నలుమూలల నుంచి జాతీయ అవార్డులు అందుకున్న ప్రతి కళాకారుడు, సాంకేతిక నిపుణుడికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి:
72th National Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు వీరే..
విక్రమ్-1 రాకెట్ విజయంపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్..
RC17 Update: చరణ్, సుక్కు సినిమా మొదలయ్యేది అప్పుడేనా..