Chiranjeevi: ‘పెద్ది’ సెట్స్‌లో మెగాస్టార్.. బుచ్చితో ఆడేసుకున్నారుగా!

ABN , Publish Date - May 08 , 2026 | 04:42 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపుదిద్దుకుంటోన్న రూరల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా వెండితెరపై సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. ఈ మూవీ సెట్స్‌లో మెగాస్టార్ చిరంజీవి సందడి చేశారు.

Chiranjeevi Visits Peddi Sets

Chiranjeevi: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) హీరోగా రూపుదిద్దుకుంటోన్న రూరల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘పెద్ది’ (Peddi Movie). ఈ సినిమా వెండితెరపై సంచలనం సృష్టించడానికి సిద్ధమవుతోంది. బుచ్చి బాబు సానా (Buchi Babu Sana) దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై నిర్మాత వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమైన ఈ మూవీ ప్రమోషన్స్‌ను మేకర్స్ ఓ రేంజ్‌లో మొదలు పెట్టారు. తాజాగా ఈ మూవీ సెట్స్‌లో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సందడి చేసిన వీడియోను చిత్రయూనిట్ విడుదల చేసింది.


‘పెద్ది’కి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. సినిమా ఫైనల్ ఎడిట్ కూడా లాక్ చేసినట్లుగా దర్శకుడు బుచ్చిబాబు తన సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దీంతో సినిమా విడుదలకు ఫైనల్ కౌంట్‌డౌన్ మొదలైంది. ఇక రాబోయే రోజుల్లో అంతా ‘పెద్ది’ మయం చేసేందుకు టీమ్ పక్కా ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి సెట్స్‌కు వచ్చిన వీడియోను మేకర్స్ వదిలారు. ఈ వీడియోలో చిరంజీవి, చరణ్ కలిసి దర్శకుడు బుచ్చిబాబును ఆటపట్టిస్తుండటం గమనించవచ్చు.


ఇటీవల బర్త్‌డే స్పెషల్‌గా వదిలిన గ్లింప్స్‌లో రామ్ చరణ్ కనిపించిన సీక్వెన్స్ షూటింగ్ జరిగే సమయంలో మెగాస్టార్ చిరంజీవి సెట్స్‌కు వెళ్లారు. ఆ సెట్స్‌లో అప్పటికే అక్కడ సుకుమార్ ఉన్నారు. చిరంజీవి రాకతో సెట్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అంతా ఎంజాయ్ మూడ్‌లోకి వచ్చేశారు. సెట్‌లో ఉన్న అందరితో చిరంజీవి సరదాగా పంచ్‌లు పేలుస్తూ కనిపించారు. మరీ ముఖ్యంగా దర్శకుడు బుచ్చిబాబుని కండలు చూపించమంటూ ఫొటోలు తీస్తుండటం ఈ వీడియోలో గమనించవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జాన్వీ కపూర్, శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్ ఇరానీ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

జబర్దస్త్ దొరబాబు కొత్త ఇల్లు చూశారా.. కళ్ళు జిగేల్ మనాల్సిందే!

తెలుగబ్బాయినే పెళ్లి చేసుకుంటా: పాయల్

Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్

Lavanya Tripathi: ఇకపై ప్రెగ్నెంట్ అని తెలిస్తే.. ఆ పని చేయను

Updated Date - May 08 , 2026 | 04:42 PM

Peddi Movie: కథ విని, 20 నిమిషాల పాటు మనిషిని కాలేకపోయా- ప్రొడక్షన్ డిజైనర్

Peddi Movie: ‘పెద్ది’ విషయంలో బుచ్చిబాబు స్ట్రాటజీ ఏంటి? ఓన్లీ రామ్ చరణేనా!

Peddi Song: ‘చికిరి’ పాట కోసం రెహమాన్‌ ఎవర్ని దింపారంటే..

Peddi Action Sequence:రామ్ చరణ్ 'పెద్ది' రిస్క్..

Peddi First Shot: రామ్ చరణ్ చెప్పినట్టే ఫస్ట్ షాట్ అదిరింది