సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mahesh Babu: సూపర్‌స్టార్‌కు చిరు, పవన్‌, వెంకీ స్పెషల్‌ విషెస్‌

ABN, Publish Date - Aug 09 , 2026 | 12:38 PM

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు (HBD Mahesh Babu) పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ మేరకు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. 

‘నా ప్రియమైన సూపర్ స్టార్ మహేశ్‌కు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. సంవత్సరాలుగా మహేశ్‌ ఎదుగుదల  చూస్తుంటే ఎంతో  ఆనందంగా ఉంది. భారతీయ సినిమాకు అత్యంత ప్రేమాభిమానాలు పొందిన, ప్రముఖ నటుల్లో ఒకరిగా ఎదగడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. దేవుడు ఎల్లప్పుడూ ఆయనను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి అన్నారు. 

'సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు మంచి ఆరోగ్యం, సంతోషం, మరెన్నో విజయాలు దక్కాలని కోరుకుంటున్నాను. మానవతా కార్యక్రమాల్లో ఆయన చేస్తున్న సేవలు, ముఖ్యంగా చిన్నారులకు సహాయం చేయడంలో చూపిస్తున్న నిబద్ధత ఎంతో స్ఫూర్తిదాయకం’

- పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్  

‘నా చిన్నోడు మహేష్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ జీవితంలో ఎప్పుడూ ప్రేమ, నవ్వులు నిండిపోవాలి. ‘వారణాసి’లో రుద్రగా మహేశ్‌ రగ్గడ్‌, హ్యాండ్సమ్‌గా కనిపిస్తున్నాడు. వచ్చే ఏడాది ‘వారణాసి’తో ప్రపంచాన్ని ఏలబోతున్న మహేశ్‌ను చూడటానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాను’

-వెంకటేష్ 

Updated Date - Aug 09 , 2026 | 01:48 PM