సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రామ్‌చరణ్‌కు స‌ర్జ‌రీ.. డాక్టర్ల‌కు మా కుటుంబ రుణపడి ఉంటుంది

ABN, Publish Date - Mar 26 , 2026 | 03:40 PM

‘పెద్ది’ షూటింగ్‌లో హీరో రామ్‌చరణ్‌కు గాయమైన సంగతి తెలిసిందే!

chiranjeevi

‘పెద్ది’ (Peddi) షూటింగ్‌లో హీరో రామ్‌చరణ్‌కు (Ram Charan) గాయమైన సంగతి తెలిసిందే! ఆయన కంటికి చిన్న గాయమైందని, ఎలాంటి ప్రమాదం లేదని, గురువారం నుంచి షూటింగ్‌లో పాల్గొంటారని చిత్ర బృందం పేర్కొంది. అయితే దీనిపై చిరంజీవి (Chiranjeevi) స్పందించారు. రామ్‌చరణ్‌ కంటికి చిన్న సర్జరీ జరిగిందని చిరు ఎక్స్‌ వేదికగా తెలిపారు.

ఈ మేరకు చరణ్‌కు సర్జరీ చేసిన వైద్యులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ‘చరణ్‌ కనురెప్పకు సరైన సమయంలో నైపుణ్యంతో సర్జరీ చేశారు. అందుకు ధన్యవాదాలు. మొదట మాకు కొంత ఆందోళన కలిగినప్పటికీ, మీ మాటలతో ధైర్యం పెరిగింది’ అని అన్నారు. చికిత్స అందించిన డాక్టర్‌లకు తమ కుటుంబం కృతజ్ఞతలతో ఉంటుందని చిరు పోస్ట్‌లో పేర్కొన్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జాన్వీ కపూర్‌ కథానాయిక. 

Updated Date - Mar 26 , 2026 | 05:05 PM