చిరు లీక్స్.. మెగా 158 టైటిల్ ఇదే
ABN, Publish Date - Aug 11 , 2026 | 07:43 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి తన సినిమాలకు సంబంధించిన సీక్రెట్స్ లేదా అప్‌డేట్స్‌ను వేదికలపై లీక్ చేయడం కొత్తేమీ కాదు. ఆయన హాజరయ్యే ప్రతి సినీ ఈవెంట్‌లోనూ లేదా ప్రెస్ మీట్‌లోనూ ఏదో ఒక సర్‌ప్రైజింగ్ లీక్ ఇవ్వడం ఆయనకు ఒక సరదా అలవాటుగా మారిపోయింది.
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)కి తన సినిమాలకు సంబంధించిన సీక్రెట్స్ లేదా అప్‌డేట్స్‌ను వేదికలపై లీక్ చేయడం కొత్తేమీ కాదు. ఆయన హాజరయ్యే ప్రతి సినీ ఈవెంట్‌లోనూ లేదా ప్రెస్ మీట్‌లోనూ ఏదో ఒక సర్‌ప్రైజింగ్ లీక్ ఇవ్వడం ఆయనకు ఒక సరదా అలవాటుగా మారిపోయింది. గతంలో పలు సందర్భాల్లో తన సినిమాల టైటిళ్లను, కీలక సన్నివేశాలను అధికారిక ప్రకటనకు ముందే స్టేజ్ మీదే సరదాగా బయటపెట్టేసి చిత్ర యూనిట్‌ను, దర్శక నిర్మాతలను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు మరోసారి ఆ చిరు లీక్స్ ట్రెండ్ రిపీట్ అయింది.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కొరియన్ కనకరాజు. రితికా నాయక్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 6 న రిలీజ్ అయ్యి భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా రికార్డ్ కలక్షన్స్ రాబట్టి వరుణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. దీంతో చిత్రబృందం.. తాజాగా కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో ఆయన చిరు లీక్స్ అందించారు. దర్శకుడు బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగా158 చిత్రానికి సంబంధించి టైటిల్, టీజర్ అప్‌డేట్‌ను చిరంజీవి మళ్లీ లీక్ చేసే ప్రయత్నం చేశారు.
మెగా 158 సినిమా షూటింగ్ మొదలైనప్పుడు డైరెక్టర్ బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తనను ఎంత వద్దు అని వారించినా వినకుండా, "పిచ్చోళ్లు.. వాళ్లు చెప్పొద్దంటే నేను ఆగిపోతానా? సరైన టైమ్ చూసి నేనే లీక్ చేస్తా" అంటూ ఒక వీడియో రిలీజ్ చేసిన విషయం తెల్సిందే. ఇక ఎట్టకేలకు కొరియన్ కనకరాజు సక్సెస్ మీట్ లో ఆయన మెగా 158 టైటిల్ కదిరి నరసింహుడు అని రివీల్ చేశారు. కదిరి అనగానే అక్కడ ఉన్నవారందరూ షాక్ అవ్వడంతో వెంటనే సైలెంట్ అయ్యారు. అంతేకాకుండా మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22 న మెగా 158 టైటిల్ టీజర్ ని రిలీజ్ చేయనున్నట్లు కూడా తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కదిరి అని హింట్ ఇవ్వడంతో కచ్చితంగా కదిరి నరసింహుడు అనే టైటిలే అయ్యి ఉంటుంది అని చెప్పుకొస్తున్నారు. మరి ఆ టైటిల్ తోనే టీజర్ వస్తుందా.. లేదా చూడాలి.