Chiru - Odela: చిరు.. శ్రీకాంత్‌ ఓదెల సినిమా అప్‌డేట్‌ ఇదే..

ABN , Publish Date - Jan 20 , 2026 | 03:27 PM

మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్‌’ చిత్రం సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు.


మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్‌’ చిత్రం సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు. సంక్రాంతి బరిలో రిలీజైన ఈ చిత్రం భారీ విజయం సాధించి రూ.300 కోట్లకు పైగా వసూళ్ల రాబట్టింది. మరో పక్క ఆయన  నటించిన సోషియో ఫాంటసీ  చిత్రం 'విశ్వంభర' చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ప్రస్తుతం  వీఎఫ్ఎక్స్  పనులు నడుస్తున్నాయి. ఈ సినిమాను సమ్మర్ లో విడుదల చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి వశిష్ట మల్లిడి దర్శకుడు. ఈ జోరు కొనసాగుతుండగానే చిరు తదుపరి చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. ప్రస్తుతం చిరు చేతిలో రెండు చిత్రాలు రెడీగా ఉన్నాయి. అందులో ఒకటి దసరా ఫేం శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో నాని సమర్పణలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. మెగా 157గా (Mega 157) ఈ చిత్రం తెరకెక్కనుంది. మరొకటి కె.ఎస్‌.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం.

ప్రస్తుతం శ్రీకాంత్‌ ఓదెల (Srikanth Odela) ప్రస్తుతం ప్యారడైజ్‌ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆ సినిమా విడుదల కావడమే చిరంజీవి చిత్రాన్ని పట్టాలెక్కిస్తామని నిర్మాత సుధాకర్‌ చెరుకూరి తెలిపారు. అంతే కాదు ఈ సినిమా జానర్‌ కూడా చెప్పారు. 1970-74 సమయంలో సాగే పీరియాడిక్‌ డ్రామా ఇదని,  ఈ చిత్రంలో చిరంజీవి సరికొత్తగా  కనిపిస్తారని  నిర్మాత సుధాకర్‌ చెరుకూరి చెప్పారు. 

Updated Date - Jan 20 , 2026 | 04:03 PM