చిరు తొలిసారి కెమెరా ముందుకొచ్చిన రోజు.. చందమామ కథలాంటి అనుభూతి
ABN, Publish Date - Feb 11 , 2026 | 10:07 PM
చిరంజీవి (chiranjeevi) నటించిన తొలి చిత్రం 'పునాది రాళ్లు' (Punaadi Raallu). అయితే 'ప్రాణం ఖరీదు' సినిమా మొదట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన అద్భుత నటన, మెస్మరైజింగ్ డ్యాన్స్‌లు, పవర్‌ఫుల్ యాక్షన్‌తో కోట్లాది అభిమానులు, ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు
చిరంజీవి (chiranjeevi) నటించిన తొలి చిత్రం 'పునాది రాళ్లు' (Punaadi Raallu). అయితే 'ప్రాణం ఖరీదు' సినిమా మొదట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయన అద్భుత నటన, మెస్మరైజింగ్ డ్యాన్స్‌లు, పవర్‌ఫుల్ యాక్షన్‌తో కోట్లాది అభిమానులు, ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈ ప్రయాణంలో అమూల్యమైన జ్ఞాపకాన్ని చిరంజీవి గుర్తు చేసుకున్నారు. 'పునాదిరాళ్లు’ సినిమా కోసం మొదటిసారి కెమెరా ముందుకు వచ్చిన ప్రత్యేక సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ పెట్టారు. 'పునాదిరాళ్లు' సినిమా కోసం జీవితంలో కెమెరా ముందు నిలిచిన తొలి రోజు ఇది. ఆ రోజు నాలో కలిగిన ఆత్రుత, ఆనందం, బాధ్యత, భావోద్వేగం మాటల్లో వర్ణించలేనిది. ఆ క్షణం ఇప్పటికీ నిన్న, మొన్న జరిగిందేమో అన్నట్టు అనిపిస్తుంది. ఈ ప్రత్యేక సందర్భంలో, నాకు ఆ తొలి అవకాశం ఇచ్చిన చిత్ర దర్శక, నిర్మాతలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారి నమ్మకం, ప్రోత్సాహంతో వచ్చిన అవకాశంతో నటనలో నా ప్రయాణానికి పునాదిరాళ్లు పడ్డాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ నన్ను ఆదరిస్తూ, ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు' అని చిరంజీవి పోస్ట్ లో పేర్కొన్నారు.
గుడిపాటి రాజ్ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రమిది. క్రాంతి కుమార్ నిర్మాత. ఈ సినిమా కోసం చిరు 1978.. ఫిబ్రవరి 11న మొదటిసారి కెమెరా ముందుకు వచ్చారు. 1979 జూన్ 21న ఈ సినిమా విడుదలైంది.