Chiranjeevi: ఇండస్ట్రీలో.. క్యాస్టింగ్ కౌచ్ లేదు! అది వారిని.. బట్టే ఉంటుంది
ABN, Publish Date - Jan 26 , 2026 | 08:48 AM
ఇటీవల థియేటర్లకు వచ్చి సంచలన రికార్డుల నమోదు చేస్తోంది మనశంకర వరప్రసాద్ గారు చిత్రం. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ క్యాస్టింగ్ కౌచ్‌పై సంచలన కామెంట్స్ చేశారు.
ఇటీవల సంక్రాంతి పండుగకు థియేటర్లకు వచ్చి సంచలన రికార్డుల నమోదు చేస్తోంది. చిరంజీవి (Chiranjeevi) నటించిన మన శంకర్ వర ప్రసాద్ గారు (Mana Shankar Vara Prasad Garu) మూవీ. అనీల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం మెగా అభిమానుల దశాబ్దాల ఆకలిని తీర్చుతూ సరికొత్త రికార్డులను నెలకొల్పుతూ అప్రతిహాతంగా దూసుకెలుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. అన్నం అమ్మ సినిమా సక్సెస్ ఎప్పుడు బోర్ కొట్టదని అన్నారు. ఈ సినిమా సక్సెస్ అనంతరం కొందరు చెప్పిన మాటలు నన్ను ఎమోషనల్ ఫీలింగ్ కలిగించాయని.. ఈ వయస్సులో కూడా ఎందుకు కష్ట పడడం అంటున్నారని నాకు కష్ట పడటంలోనే ఆనందం ఉందని.. అందుకు తగ్గ ఉత్సాహం అభిమానుల శ్రేయోభిలాషుల ప్రశంసల నుంచే లభిస్తుందని తెలిపారు.
ఈ సంక్రాంతికి విడుదలైన అన్ని సినిమాలు విజయవంతం అవటం సంతోషంగా ఉందని.. చాలా కాలం తర్వాత ఈ సినిమాతో వింటేజ్ చిరంజీవితో పాటు ఆ వింటేజ్ షీల్డ్‌లు మళ్లీ చూడటం కూడా ఆనందగా ఉందని అన్నారు. అయితే.. కొందరు ఔట్ డోర్ యూనిట్ బిల్లులు ఎక్కువగా వేస్తున్నారని కానీ ఈ సినిమాను మాత్రం 85 రోజుల్లో అనుకున్న బడ్జెట్‌లోనే చేయగలిగాం అన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది లేదని, మగ పిల్లలయినా, ఆడ పిల్లలయినా చిత్ర పరిశ్రమలోకి వస్తామంటే ఎంకరేజ్ చేయాలని సూచించారు. ఇండస్ట్రీ అద్దం లాంటిదని.. మనం ఎలా బిహేవ్ చెస్తామో రిజల్ట్ కూడా అలానే ఉంటుంది.. ఇక్కడ ఎవరి వర్కింగ్ స్టయిల్ వారిదన్నారు. ఇక్కడ బాగాలేదు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని అంటే అది వారి తప్పిదమని నేననుకుంటా అన్నారు. ఎవరి వ్యక్తిత్వం, వారి బీహేవియర్‌ను బట్టే మనకు ఎదురయ్యే ఘటనలు ఉంటాయన్నారు.