Niharika Konidela: నిజంగానే నేను పెద్ద తోపుని..
ABN, Publish Date - Jul 20 , 2026 | 05:27 PM
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) నిర్మించిన చిన్న చిత్రం కమిటీ కుర్రోళ్లు (committee kurrollu) జాతీయ చలనచిత్ర అవార్డుల్లో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే.
మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) నిర్మించిన చిన్న చిత్రం కమిటీ కుర్రోళ్లు (committee kurrollu) జాతీయ చలనచిత్ర అవార్డుల్లో సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక అవార్డు దక్కడంతో చిత్ర యూనిట్‌తో పాటు మెగా కాంపౌండ్‌లో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా చిత్రబృందం ఒక సక్సెస్ ఈవెంట్ ని నిర్వహించింది. ఈ ఈవెంట్ లో నిర్మాతగా తొలి జాతీయ అవార్డును అందుకున్న నిహారిక కొణిదెల తన సంతోషాన్ని, ఎమోషన్స్‌ను పంచుకుంటూ ఆనందం వ్యక్తంచేసింది. తన కలల ప్రాజెక్టుకు ఇలాంటి గుర్తింపు రావడం పట్ల ఆమె మేకర్స్‌కి, ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.
ఈ అద్భుత విజయంపై మెగాస్టార్ చిరంజీవి సైతం నిహారికను ప్రత్యేకంగా ప్రశంసించినట్లు ఆమె తెలిపింది. గతంలో తమ బ్యానర్‌లో వచ్చిన రుద్రవీణ చిత్రానికి గానూ తండ్రి నాగబాబు జాతీయ అవార్డు అందుకున్నారని, ఇప్పుడు ఆయన బాటలోనే కుమార్తెగా నువ్వు కూడా జాతీయ అవార్డు దక్కించుకోవడం తమ కుటుంబానికి ఎంతో గర్వకారణమని చిరంజీవి కొనియాడినట్లు తెలిపింది. పెదనాన్న చిరంజీవి నుంచి వచ్చిన ఈ ప్రశంస నిహారికను ఎంతగానో భావోద్వేగానికి గురిచేసినట్లు చెప్పుకొచ్చింది.
'చిరంజీవి గారు ఈ ఇండస్ట్రీకే ప్రైడ్ (గౌరవం). అంతటి తోపు నటుడే నన్ను తోపు అని మెచ్చుకుంటుంటే, నేను నిజంగానే తోపులా ఫీల్ అవుతాను కదా' అంటూ నిహారిక సరదాగా, ఎంతో గర్వంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం నిహారిక వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మెగా కాంపౌండ్ హీరోయిన్ గా వచ్చినా ఆమె ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక నిర్మాతగా మారి ఆమె చేసిన ఒక సినిమా నేషనల్ అవార్డ్ అందుకోవడంతో మెగా డాటర్ నిర్మాతగానే కొనసాగనుందని తెలుస్తోంది. మరి ముందు ముందు ఆమె ఇంకెన్ని విజయాలు అందుకుంటుందో చూడాలి.