ఆకాశంలో ఒక తారకి చిరు సపోర్ట్..
ABN, Publish Date - Nov 24 , 2026 | 08:56 PM
సినిమా ఏదైనా సరే.. అది బావుంది అంటే ఇండస్ట్రీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా మెగా సపోర్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రేక్షకులు ఆదరించి, మంచి పాజిటివ్ టాక్ వస్తే కనుక మెగాస్టార్ చిరంజీవి కచ్చితంగా ఆ సినిమాని వీక్షించి, ఆ చిత్రబృందంపై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు.
సినిమా ఏదైనా సరే.. అది బావుంది అంటే ఇండస్ట్రీ సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. ముఖ్యంగా మెగా సపోర్ట్ మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రేక్షకులు ఆదరించి, మంచి పాజిటివ్ టాక్ వస్తే కనుక మెగాస్టార్ చిరంజీవి కచ్చితంగా ఆ సినిమాని వీక్షించి, ఆ చిత్రబృందంపై ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు. తాజాగా చిరంజీవి (Chiranjeevi) తాజాగా ఆకాశంలో ఒక తార(Aakasamlo Oka Tara) చిత్రాన్ని వీక్షించి, సినిమా యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 20 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. భార్య కలను నెరవేర్చే భర్తగా దుల్కర్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు.
ఇక ఆకాశంలో ఒక తార సినిమా తన మనసును ఎంతో కదిలించిందని చిరు చెప్పుకొచ్చారు. ' ఆకాశంలో ఒక తార సినిమా చూశాను. నా మనసును ఎంతో కదిలించిన చిత్రం ఇది. ఇంత స్ఫూర్తిదాయకమైన కథను ఎంతో నమ్మకంతో, అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు పవన్ సాధినేనిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా సెకండాఫ్ అంతా ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను. దుల్కర్ సల్మాన్, సాత్విక తమ సహజమైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. శృతి హాసన్, రుహానీ శర్మతో పాటు నటీనటులందరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
జీవీ ప్రకాష్ సంగీతం, సుజిత సారంగ్ అద్భుతమైన ఛాయాగ్రహణం కథలోని భావోద్వేగాలను మరింతగా మనసుకు హత్తుకునేలా చేశాయి. ప్రతి సాంకేతిక విభాగం పనితీరు ప్రశంసనీయం. తల్లిదండ్రులందరూ తప్పకుండా మీ పిల్లలతో కలిసి ఈ సినిమా చూడండి. ఈ కథ వారిలో గొప్ప స్ఫూర్తిని నింపుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.ప్రొడ్యూసర్స్ స్వప్న సినిమా, గీతా ఆర్ట్స్, లైట్ బాక్స్ మీడియా సంస్థలకు, చిత్ర బృందం మొత్తానికి నా హృదయపూర్వక అభినందనలు' అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి చిరు సపోర్ట్ తో ముందు ముందు ఆకాశంలో ఒక తార మరిన్ని రికార్డులు సృష్టిస్తుందేమో చూడాలి.