చిరంజీవి: యాదృచ్చికంగా శ్రీరామనవమి రోజు కలిసొచ్చింది
ABN, Publish Date - Mar 27 , 2026 | 08:25 PM
మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో హోమం నిర్వహించారు. శ్రీరామనవమి, రామ్ చరణ్ పుట్టిన రోజులను పురస్కరించుకుని చిరు తన ఇంట్లో ప్రత్యేక పూజలతోపాటు రామ్ చరణ్ తో మహా సుదర్శన హోమం చేయించారు.
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) ఇంట్లో హోమం నిర్వహించారు. శ్రీరామనవమి, రామ్ చరణ్ పుట్టిన రోజులను (HBD Ram charan) పురస్కరించుకుని చిరు తన ఇంట్లో ప్రత్యేక పూజలతోపాటు రామ్ చరణ్ తో మహా సుదర్శన హోమం చేయించారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఓ పోస్టు పెట్టారు. ‘శ్రీరామజయం.. ఆ శ్రీరాముని అడుగుజాడల్లో నడిస్తే మనదే విజయం. ఈ ఏడాది శ్రీరామనవమి రోజు యాదృచ్చికంగా చరణ్ బాబు పుట్టినరోజు కలిసి రావడం ఎంతో సంతోషం. ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులతో పాటు.. రాముని చరణాల వద్ద తేజోరూపుడై కొలువుండే మా ఇలవేల్పు హనుమంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుతూ.. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.. జై శ్రీరామ్...!’ అని రాసుకొచ్చారు. చరణ్ హోమం చేస్తున్న వీడియోను కూడా ఆయన షేర్ చేశారు.
ప్రస్తుతం రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. రెండు రోజుల క్రితం యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా చరణ్ ప్రమాదానికి గురయ్యారు. ఆయన కంటికి గాయం అయింది. నాలుగు కుట్లు పడ్డాయి. గాయం మానకముందే చరణ్ మళ్లీ షూటింగ్‌లో పాల్గొని ఫ్యాన్స్‌ను సర్‌ప్రైజ్ చేశారు. చరణ్ కంటికి బ్యాండేజీతో షూటింగ్ స్పాట్ దగ్గరకు వచ్చిన దృశ్యాల తాలూకా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.