Chiranjeevi: మనసులో ఎప్పటికీ యువకుడిగానే ఉండేవారు..
ABN , Publish Date - Oct 04 , 2026 | 09:29 AM
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 9Singeetham Srinivasarao) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు 9Singeetham Srinivasarao) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సింగీతం శ్రీనివాసరావును ఒక గొప్ప దార్శనికుడిగా అభివర్ణించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. “దిగ్గజ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు గారు కన్నుమూయడం తీవ్రంగా కలచివేసింది. ఆయన నిజమైన దార్శనికుడు. కొత్త ఆలోచనలను అన్వేషించేందుకు ఆయన చూపిన ఊహాశక్తి, ధైర్యం భారతీయ సినిమాకు ఎన్నో మరపురాని చిత్రాలను అందించాయి. సినీ రంగానికి ఆయన చేసిన సేవలను ఎప్పటికీ ఎంతో గౌరవంతో, ఆప్యాయతతో గుర్తుచేసుకుంటాం. ఇటీవల ఆయన రూపొందించిన ‘సింగ్ గీతం’ చిత్రం కథలు చెప్పాలనే ఆయనకు ఉన్న అచంచలమైన తపనకు అందమైన నిదర్శనం. మనసులో మాత్రం ఆయన ఎప్పటికీ యువకుడిగానే ఉండేవారు. ఎప్పుడూ కొత్త విషయాలను తెలుసుకోవాలని, కొత్తగా సృష్టించాలని ఆసక్తి చూపేవారు. ఆయన కుటుంబ సభ్యులకు, ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి. సింగీతం గారిని మేమంతా మిస్ అవుతాం. ఆయన సినిమాలు తరతరాల ప్రేక్షకులతో ఎప్పటికీ మాట్లాడుతూనే ఉంటాయి. ఓం శాంతి” అని చిరంజీవి పేర్కొన్నారు.
ALSO READ:
Pawan Kalyan: సింగీతం శ్రీనివాసరావు మృతి.. పవన్ కల్యాణ్ తీవ్ర సంతాపం
చిత్రసీమలో తీవ్ర విషాదం: సీనియర్ దర్శకుడు సింగీతం మృతి
భారతీయ సినిమాకు తీరని లోటు: నందమూరి బాలకృష్ణ
వైవిధ్య చిత్రాల రూపశిల్పి... సింగీతం!