సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

అనిల్ రావిపూడి మాస్టర్ ప్లాన్.. చిరు - నాగ్ తో సినిమా

ABN, Publish Date - Aug 01 , 2026 | 03:28 PM

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), కింగ్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ల మధ్య ఉన్న ప్రాణస్నేహం గురించి అందరికీ తెలిసిందే.

Chiru- Nag

మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi), కింగ్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ల మధ్య ఉన్న ప్రాణస్నేహం గురించి అందరికీ తెలిసిందే. గతంలో వెంకటేష్ నటించిన త్రిమూర్తులు చిత్రంలో వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించగా, ఆ తర్వాత స్టైల్ సినిమాలో నటించినా ఒకే స్క్రీన్‌పై కలిసే అవకాశం రాలేదు. అయితే, ఈ ఇద్దరు దిగ్గజాలను ఒకే ఫ్రేమ్‌లో చూపేందుకు టాలీవుడ్ హిట్ మెషీన్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) బిగ్ ప్లాన్ వేస్తున్నట్లు సమాచారం. ఇటీవల మన శంకరవరప్రసాద్ గారు చిత్రంలో చిరంజీవి, వెంకటేష్ కాంబోతో బాక్సాఫీస్ వద్ద బంపర్ హిట్ కొట్టిన అనిల్, ఇప్పుడు డబుల్ ధమాకా లాగా చిరు-నాగ్ కాంబినేషన్‌లో ఓ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది.


ఇప్పటికే సీనియర్ స్టార్స్ అయిన వెంకటేష్‌తో నాలుగు సినిమాలు చేసిన అనిల్, బాలకృష్ణతో భగవంత్ కేసరి వంటి సందేశాత్మక చిత్రం, చిరంజీవితో బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించాడు. అంతేకాకుండా బాలయ్యతో మరో సినిమా, చిరుతో రెండో సినిమాకి కూడా లైన్ సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే టాలీవుడ్ బిగ్-4 సీనియర్ హీరోలలో ఒక్క నాగార్జునతో మాత్రమే ఆయన ఇప్పటివరకు సినిమా తీయలేదు. ఆ లోటును త్వరలోనే తీర్చుకుంటానని గతంలో ప్రకటించిన అనిల్, నాగార్జునను ఏ రీతిలో తెరపై ఆవిష్కరిస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.


ఒకేవేళ నాగార్జునతో కూడా సినిమా తీసి విజయాన్ని అందుకుంటే, టాలీవుడ్ దిగ్గజ దర్శకులు కె. రాఘవేంద్రరావు, బి. గోపాల్ తర్వాత ఆ నలుగురు సీనియర్ స్టార్స్ (చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్)తో సినిమాలు తీసి హిట్స్ కొట్టిన అరుదైన క్రెడిట్, రికార్డు అనిల్ రావిపూడి సొంతమవుతాయి. చిరు-నాగ్ కాంబోను ఒకే తెరపైకి తీసుకురావడంతో పాటు ఈ హిస్టారిక్ రికార్డ్‌ను అనిల్ ఎలా సాధిస్తారో వేచి చూడాలి.

Updated Date - Aug 01 , 2026 | 04:30 PM