Chiranjeevi: లుక్ టెస్ట్ పూర్తి.. ‘హింసకు ముందు నిశ్శబ్దం’
ABN, Publish Date - Apr 28 , 2026 | 01:21 PM
ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు చిత్రాలున్నాయి.
ఈ ఏడాది సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్’ చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi). ప్రస్తుతం ఆయన చేతిలో మూడు చిత్రాలున్నాయి. ‘విశ్వంభర’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఉంది. మరో రెండు చిత్రాలు సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉంది. అందులో ఒకటి బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కబోచే ‘మెగా 158’ (Mega 158). మరొకటి ఓదెల శ్రీకాంత్ దర్శకత్వం వహించే చిత్రం. ప్రస్తుతం కె.ఎస్.రవీంద్ర(బాబీ) సినిమా త్వరలో సెట్స్‌కి వెళ్లనుంది. కె.వి.ఎన్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన విడుదలై చాలాకాలమైంది. అయితే ఇదే సంస్థ నిర్మించిన ‘జన నాయగన్’ చిత్రం విడుదలలో పలు సమస్యలు తలెత్తడంతో ‘మెగా 158’ పూజా కార్యక్రమాలు, రెగ్యులర్ షూటింగ్‌ను వాయిదా వేశారు. దాంతో ఈ సినిమా ఆగిపోయిందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఆ వార్తల్ని నిర్మాణ సంస్థ ఖండించింది.
మంగళవారం ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. ఓ ఫోటోను విడుదల చేసి ‘మెగా 158’ చిత్రానికి సంబంధించిన లుక్ టెస్ట్ పూర్తయ్యిందని, అది అద్భుతమైన ఆనందాన్ని కలిగించిందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీనికి ‘హింసకు ముందు నిశ్శబ్దం’ అనే క్యాప్షన్ రాశారు. సినిమా ముహూర్తం, రెగ్యులర్ షూటింగ్ అప్‌డేట్ త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. చిరు, బాబీ కింబినేషన్‌లో వాల్తేరు వీరయ్య చిత్రం భారీ విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి.