‘కాకా’ సంక్రాంతికే.. రూమర్స్‌కు కోన వెంకట్ కౌంటర్
ABN, Publish Date - Nov 06 , 2026 | 04:30 PM
టాలీవుడ్లో సంక్రాంతి సీజన్ వచ్చిందంటే బాక్సాఫీస్ వార్ ఎంత రసవత్తరంగా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతీ ఏడాదిలాగే రాబోయే సంక్రాంతి బరిలో నిలవబోయే సినిమాలపై సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
టాలీవుడ్లో సంక్రాంతి సీజన్ వచ్చిందంటే బాక్సాఫీస్ వార్ ఎంత రసవత్తరంగా సాగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతీ ఏడాదిలాగే రాబోయే సంక్రాంతి బరిలో నిలవబోయే సినిమాలపై సినీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ భారీ స్థాయిలో ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా దర్శకుడు బాబీ కొల్లి, ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ కలయికలో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘కాకా’ (Kaaka) విడుదలపై రకరకాల రూమర్లు సోషల్ మీడియాను ముంచెత్తాయి. సంక్రాంతి బరి నుంచి ఈ సినిమా తప్పుకుందని, ఆ స్థానంలో మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటిస్తోన్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం ‘విశ్వంభర’ రాబోతోందంటూ కథనాలు వెలువడ్డాయి.
అంతేకాకుండా, ‘కాకా’ చిత్రాన్ని కేవలం తెలుగుకే పరిమితం చేయకుండా పాన్-ఇండియా స్థాయిలో అత్యంత భారీగా రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారని, ఆ విజువల్ హంగులు, వీఎఫ్ఎక్స్ పనుల కోసమే సినిమాను వేసవికి వాయిదా వేశారంటూ రూమర్స్ జోరుగా ప్రచారమయ్యాయి. ఈ ఊహాగానాలు కాస్తా సినీ ప్రియుల్లో తీవ్ర గందరగోళానికి దారితీశాయి. తాజాగా ఈ వార్తలన్నింటికీ ఒక్క దెబ్బతో ముగింపు పలుకుతూ, రూమర్లన్నింటినీ పటాపంచలు చేస్తూ ప్రముఖ స్టార్ రైటర్ కోన వెంకట్ సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే క్లారిటీ ఇచ్చారు.
ఈ ప్రచారాలపై కోన వెంకట్ (Kona Venkat) తన ‘ఎక్స్’ ఖాతా ద్వారా స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. ‘‘మరోసారి చెబుతున్నాం.. ‘కాకా’పై వస్తున్న అన్ని రూమర్స్‌కు, తప్పుడు వార్తలకు, నిరాధారమైన ఆర్టికల్స్‌కు ‘రెస్ట్ ఇన్ పీస్’ (RIP)! మిమ్మల్ని నిరాశపరుస్తున్నందుకు క్షమించండి.. కానీ, మేము జనవరి 13న పక్కాగా ల్యాండ్ అవుతున్నాం. సంక్రాంతికి ‘కాకా’ వస్తున్నాడు.. అసలైన పండగ తెస్తున్నాడు’’ అంటూ సూటిగా, స్పష్టంగా తేల్చిచెప్పారు.
కోన వెంకట్ చేసిన ఈ పవర్ఫుల్ ట్వీట్‌తో సినిమా వాయిదా పడిందంటూ ప్రచారం చేసిన వారికి గట్టి చెంపపెట్టు తగిలినట్లయింది. చిత్ర యూనిట్ తీసుకున్న ఈ నిర్ణయంతో అభిమానుల్లో పండగ ఉత్సాహం రెట్టింపైంది. ఎలాంటి అనుమానాలు లేకుండా జనవరి 13నే థియేటర్లలోకి ‘కాకా’ రాబోతున్నట్లు అధికారికంగా ధ్రువీకరించడంతో బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి సందడి మరింత వేడెక్కింది. మరి పండగ బరిలో ‘కాకా’ ఎలాంటి రికార్డులను సృష్టిస్తాడో వేచి చూడాలి!
ఇవి కూడా చదవండి:
బండి సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ చూశారా
‘మహాకాళి’ నుంచి ‘అయిగిరి నందిని’ సాంగ్ విడుదల.. పూనకాలే
సాయి దుర్గ తేజ్ - కిరణ్‌ల నిశ్చితార్థం.. హాజరైన పలువురు సెలబ్రిటీలు