సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chiranjeevi: ఆ దురలవాట్లు.. వదిలేస్తే విజయం ఖాయం

ABN, Publish Date - Jul 27 , 2026 | 03:33 PM

హైదరాబాద్‌లో జరిగిన ఛేంజ్ మేకర్-2026 పురస్కార వేడుకలో చిరంజీవి యువతకు కీలక సందేశం ఇచ్చారు.

Chiranjeevi

విదురుడు సూచించిన దురలవాట్లను (Vidura Six Bad Habits) వదిలేయడం ద్వారా ప్రతిఒక్కరూ కచ్చితంగా విజేతలుగా నిలుస్తా రంటూ ప్రముఖ సినీనటుడు చిరంజీవి (Chiranjeevi) యువతకు దిశానిర్దేశం చేశారు. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపు ణుడు డాక్టర్ బీవీ పట్టాభిరాం (BV Pattabhiram Award) స్మారక పురస్కారం 'ఛేంజ్ మేకర్-2026 (Change Maker 2026) కు ప్రముఖ రక్షణ రంగ శాస్త్రవేత్త, డీఆర్డీవో మాజీ చైర్మన్ (DRDO Former Chairman) గుండ్రా సతీష్ రెడ్డి (Gundra Satheesh Reddy) ఎంపికయ్యారు. 'ఎమెస్కో-డాక్టర్ బీవీ పట్టాభిరాం' ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమంలో ఛేంజ్ మేకర్ పురస్కారాన్ని శాస్త్రవేత్త సతీష్ రెడ్డికి చిరంజీవిఅందజేశారు.

ఈ సంద‌ర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. గొప్ప వ్యక్తులు ఎప్పుడూ అతి సామాన్యంగా ఉంటారనడానికి సతీష్ రెడ్డి నిదర్శనమని కొనియాడారు. ఏపీ ఆరోగ్య మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా రాష్ట్రానికి రక్షణ, ఏరో స్పేస్ రంగాల్లో పెట్టుబడులు తీసుకు రావడంలో సతీష్ రెడ్డి పాత్ర శ్లాఘనీయమన్నారు. అనంత‌రం సతీష్ రెడ్డి మాట్లాడుతూ రక్షణరంగ పరిశోధనలకు అంకితమైన శాస్త్రవేత్తలకు అవార్డును అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు కె. రామచంద్రమూర్తి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్ర రావు, శాంతా బయోటెక్ వరప్రసాద్ రెడ్డి, ఏపీ హైకోర్టు జస్టిస్ ఎన్. హరినాథ్, జస్టిస్ రాజేశ్వరరావు, జస్టిస్ నరసింహారెడ్డి, రక్షణ రంగ శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jul 27 , 2026 | 05:46 PM