సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chiranjeevi: చిరంజీవి పొల్లాచి షూటింగ్ పూర్తి .. ఇక పెద్దిపై దృష్టి

ABN, Publish Date - Jun 11 , 2026 | 12:27 PM

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మెగా158’ చిత్రంతో బిజీగా ఉన్నారు.

మెగాస్టార్‌ చిరంజీవి ప్రస్తుతం బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మెగా158’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇటీవల తాజా షెడ్యూల్‌ కోసం పొలాచ్చి వెళ్లి చిత్రం బృందం అక్కడి షూటింగ్‌ పూర్తి చేసుకుని హైదరాబాద్‌ చేరుకున్నారని తెలిసింది. చిరు షూటింగ్‌లో ఉన్నా ఆయన మనసంతా ‘పెద్ది’ సినిమా రిలీజ్‌ మీద, రిజల్ట్‌ మీదే ఉందని స్వయంగా ట్వీట్‌ చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌ చేరుకున్న చిరంజీవి ఈరోజు సాయంత్రం ఏఎంబీ థియేటర్స్ లో కుటుంబ సభ్యులతో కలిసి సినిమా చూడబోతున్నారు. అయితే ఇప్పటికే సినిమా రిజల్ట్‌, కలెక్షన్లు తెలుసుకున్న చిరంజీవి ఆనందంగా ఉన్నారని తెలిసింది. అయితే ఈ చిత్రానికి ఆదరణ ఎంతగా ఉందో.. హీరోయిన్‌ పాత్రపై అంతే ట్రోలింగ్‌ కూడా జరిగింది. ట్రోలింగ్‌ను, ప్రేక్షకులు ఇచ్చిన సూచనల మేరకు దర్శకుడు బుచ్చిబాబు స్పందించి హీరోయిన్‌ పాత్రకు సంబంధించి అభ్యంతరకర సన్నివేశాలను తొలగిస్తామని ప్రకటించారు. బాలీవుడ్‌తోపాటు పలువురు ట్రోల్‌ చేసిన సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా అలాగే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం చిరంజీవి సినిమా చూసిన తర్వాత ఆ సన్నివేశాల విషయంలో ఓ నిర్ణయానికి వస్తారట.


అయితే చిరంజీవి ఇంకా సినిమా చూడనప్పటికీ సినిమాకు నలుదిక్కులు నుంచి వస్తున్న స్పందన, కలెక్షన్లు తెలుసుకుని చాలా ఆనందంగా ఉన్నారని చిరు సన్నిహితుల చెబుతున్నారు. సినిమాలో క్రికెటర్‌గా, రెజ్లర్‌గా రామ్‌చరణ్‌ కనిపించిన తీరు, బాడీ ట్రాన్‌ఫర్మేషన్‌ విషయంలో ఇప్పటికే చిరు ప్రసంశలు కురిపించారు. అవే మాటలు ఇప్పుడు ప్రేక్షకుల, అభిమానుల నుంచి విని ఆయన పుత్రోత్సాహంలో ఉన్నారని తెలిసింది.

ప్రస్తుతం రామ్‌చరణ్‌కు ఉన్న క్రేజ్‌కు, మార్కెట్‌కు ఇంత కష్టపడి, బాడీ ట్రాన్‌ఫర్మేషన్‌ చేసుకుని సినిమా చేయాల్సిన అవసరం లేదని, మామూలు కమర్షియల్‌ సినిమా చేసినా కోట్లు వసూళ్లు రాబట్టవచ్చని అంటున్నారు అభిమానులు. అయితే నటనలో తండ్రితోనే పోటీపడేంత డెడికేటింగ్‌గా వర్క్‌ చేసే రామ్‌చరణ్‌ పూర్తిగా ఈ కథను నమ్మి, నేటితరానికి క్రీడల విషయంలో ఆవగాహన, స్ఫూర్తి కలిగించాలి సినిమా చేశారని, దానికి తగ్గ ఫలితం దక్కిందని అభిమానులు, నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jun 11 , 2026 | 12:40 PM