విక్రమ్-1 రాకెట్ విజయంపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్..
ABN, Publish Date - Jul 18 , 2026 | 04:17 PM
భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర లిఖిస్తూ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ రూపొందించిన దేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయింది. దీనిపై చిరంజీవి పోస్ట్ వైరల్ అవుతోంది.
భారత ప్రైవేట్ అంతరిక్ష రంగంలో సరికొత్త చరిత్ర లిఖిస్తూ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ రూపొందించిన దేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ (Vikram-1) ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయింది. శ్రీహరికోట నుంచి శనివారం విజయవంతంగా దూసుకెళ్లిన ఈ రాకెట్, నిర్ణీత కక్ష్యలోకి ఉపగ్రహాలను చేర్చి అద్భుత మైలురాయిని అందుకుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంపై మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, చిత్ర పరిశ్రమతో పాటు యావత్ దేశం గర్వించేలా ఒక ప్రత్యేకమైన ట్వీట్ చేశారు. ఈ అద్భుత విజయాన్ని సాధించిన స్కైరూట్ ఏరోస్పేస్ బృందంతో పాటు ఇస్రో (ISRO), ఇన్-స్పేస్ (IN-SPACe) సంస్థలకు ఆయన తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల చిరంజీవి తన ట్వీట్‌లో హర్షం వ్యక్తం చేశారు. ‘‘భారత అంతరిక్ష ప్రస్థానంలో ఈరోజు ఒక చారిత్రాత్మక మైలురాయిగా నిలిచిపోతుంది. మన దేశంలోనే తొలిసారిగా ఒక ప్రైవేట్ భాగస్వామ్యంతో రూపుదిద్దుకున్న ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ విజయవంతంగా ప్రయోగించబడటం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది’’ అని పేర్కొన్నారు. ప్రైవేట్ రంగానికి ఊతమిస్తూ అంతరిక్ష రంగంలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించడంపై ఆయన అభినందనల వర్షం కురిపించారు.
ముఖ్యంగా ఈ రాకెట్ హైదరాబాద్‌లోనే రూపుదిద్దుకోవడంపై మెగాస్టార్ మరింత గర్వంగా ఫీలయ్యారు. హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ (Skyroot Aerospace) సంస్థలోని ప్రతిభావంతులైన యువ శాస్త్రవేత్తల బృందం ఈ రాకెట్‌ను పూర్తిగా ఇక్కడే డిజైన్ చేసి, డెవలప్ చేయడం తనకు ఎనలేని గర్వాన్ని, సంతోషాన్ని ఇస్తోందని చిరంజీవి కొనియాడారు. ఈ చారిత్రాత్మక విజయం దేశంలోని కోట్లాది మంది యువతలో సరికొత్త ఆలోచనలకు, స్ఫూర్తికి కారణమవుతుందని.. భవిష్యత్తులో ‘వికసిత్ భారత్’ వైపు మన దేశం మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఇది దోహదపడుతుందని ఆకాంక్షిస్తూ.. ‘కంగ్రాచ్యులేషన్స్ టీమ్ విక్రమ్-1!’ అంటూ తన సంతోషాన్ని తెలియజేశారు.
ఇవి కూడా చదవండి:
RC17 Update: చరణ్, సుక్కు సినిమా మొదలయ్యేది అప్పుడేనా..
నాట్ ఈజీ.. కానీ, రోజూ ఒక గంటసేపు చేయండి: అనసూయ
KJQ: ‘కింగ్ జాకీ క్వీన్’ రిలీజ్ ఖరారు.. ఎప్పుడంటే