Chiranjeevi: విశ్వంభర విడుదలపై చిరు క్లారిటీ.. డేట్ ఫిక్స్
ABN, Publish Date - Jan 31 , 2026 | 12:10 PM
‘మన శంకరవరప్రసాద్‌గారు’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మరో పక్క తదుపరి చిత్రాల విషయంలోనూ స్పీడ్ పెంచారు చిరు.
‘మన శంకరవరప్రసాద్‌గారు’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. మరో పక్క తదుపరి చిత్రాల విషయంలోనూ స్పీడ్ పెంచారు చిరు. ప్రస్తుతం ఆయన చేతిలో శ్రీకాంత్ ఓదెల, కొల్లి బాబీ దర్శకత్వంలో సినిమాలు క్యూలో ఉన్నాయి. ఇవి కాకుండా వశిష్ఠ దర్శకత్వం వహించిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘విశ్వంభర’ (Vishwambhara)చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పుడు ప్రేక్షకులు, అభిమానుల దృష్టంతా ఈ సినిమాపైనే ఉంది. దీంతో అంచనాలు కూడా భారీగా ఉన్నాయి. గతేడాదే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ పనుల వల్ల ఆలస్యమైంది. ఇప్పుడు ఈ పనులన్నీ దార్లోకి వచ్చి విడుదల దిశగా ముందుకెళ్తుంది. మొదట మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం జులై మొదటి వారంలో ఈ సినిమాను విడుదల చేయడానికి యువి. క్రియేషన్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది.
ఈ విషయంపై చిరంజీవి కూడా ఇటీవల స్పందించారు. ‘ఈ సినిమా జులై 9న తెరపైకి వచ్చే అవకాశముంది. దీనికి సంబంధించిన వీఎఫ్‌ఎక్స్ వర్క్ ఇంకా చూడలేదు’ అని అన్నారు. వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిష, ఆషికా రంగనాథ్‌గా నటించారు.