Chiranjeevi: కోరుకున్నట్లే జరిగింది.. మీడియాతో చిరంజీవి.. డాక్టర్ల బృందం
ABN, Publish Date - Feb 01 , 2026 | 11:39 AM
రామ్ చరణ్, ఉపాసన దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చిన సందర్భంగా చిరంజీవి మీడియా ముందుకు వచ్చారు. తమ ఇంటికి వారసుడు వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేశారు
‘మన శంకరవరప్రసాద్’ చిత్రం సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇంట మరో సందడి నెలకొంది. చిరంజీవి కోడలు, రామ్‌చరణ్ భార్య ఉపాసన మరోసారి ప్రసవించింది. జనవరి 31వ తేది రాత్రి ఉపాసన (Ram charan -Upasana) కవల పిల్లలకు జన్మనిచ్చింది. ఈ జంటకు క్లీంకార తొలి సంతానం. ఇప్పుడు ఓ బాబుకు, పాపకు జన్మనిచ్చారు. దీంతో చిరు కుటుంబానికి మరో వారసుడు వచ్చినట్లయింది. తల్లి బిడ్డలు క్షేమంగా ఉన్నారని అపోలో యాజమాన్యం ఓ బులిటెన్ విడుదల చేసింది.
ALSO READ: Mega Family: మెగా.. వారసుడొచ్చేశాడు! కవలలకు.. జన్మనిచ్చిన ఉపాసన
ఈ విషయాన్ని అభిమానులతో పంచుకునేందుకు చిరంజీవి మీడియా ముందుకొచ్చారు. చిరంజీవి మాట్లాడుతూ ‘రామ్‌చరణ్, ఉపాసన దంపతులు శనివారం రాత్రి కవల పిల్లలకు జన్మనిచ్చారు. ఉపాసన, బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారు. మేమంతా కోరుకున్నట్లుగానే హనుమాన్ ఆశీస్సులతో ఓ మగబిడ్డ, ఓ ఆడబిడ్డకు ఉపాసన జన్మనిచ్చింది. కొణిదెల, కామినేని, మెగా అభిమానులకు ఇదెంతో ఆనందించదగ్గ విషయం. మమ్మల్ని అభిమానించే శ్రేయోభిలాషులు, అభిమానులు, మా మంచిని కాంక్షించే అందరితో ఈ శుభవార్తను పంచుకోవాలనిపించి మీ ముందుకు వచ్చాను. చెన్నై అపోలో క్రెడిల్ నుంచి వచ్చిన డా. సుమన గారు పురుడు పోశారు. క్లీంకారకు కూడా ఆమె చేశారు. డాక్టర్ రుమా సిన్హ, డాక్టర్ లతకు కృతజ్ఞతలు. మా అభిమానులకు ఇది ఎంతో ఆనందకర సమయం’ అని అన్నారు. ఈ కాన్పులో మొదట బాబు, తదుపరి పాప ప్రసవించారని తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని, డాక్టర్లు చెప్పారు.