‘స్పిరిట్’లో.. చిరంజీవి, డాన్ లీ లేరా?
ABN, Publish Date - Aug 18 , 2026 | 08:21 AM
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతుంది.
రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ ‘స్పిరిట్’ (Spirit). ఈ సినిమా ఆరంభం నుంచే ఆకాశాన్నంటే భారీ అంచనాలు ఉన్నాయి. యానిమల్ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సందీప్ రెడ్డి వంగా తనదైన స్టైల్‌లో ప్రభాస్‌ను సరికొత్తగా చూపించబోతున్నారనే ప్రచారం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా నుంచి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్‌తో పాటు సాధారణ సినీ లవర్స్ సైతం అత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు అంచనాలను మరింతగా రెట్టింపు చేయగా జాతీయ స్థాయిలో సామాజిక మాధ్యమాలు హోరెత్తిపోయాయి.
ఇదిలాఉంటే.. ఇక ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే మూవీ షూటింగ్ 40 శాతానికి పైగా పూర్తయినట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు జరిగిన చిత్రీకరణలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), కొరియన్ స్టార్ డాన్ లీ (Ma Dong-seok, Don Lee) పాత్రలకు సంబంధించిన సన్నివేశాలు లేవని టాక్ వినిపిస్తోంది.
అయితే.. ‘స్పిరిట్’ చిత్రంలో చిరంజీవి, కొరియన్ స్టార్ డాన్ లీ కీ రోల్స్ చేస్తున్నారని గతంలో అనేక వార్తలు ఫుంఖాను ఫుంఖాలుగా వచ్చిన విషయం అందరికీ విధితమే. అంతేగాక ఈ వార్తలను మేకర్స్ ఇప్పటి వరకు అటు దృవీకరించక పోగా ఇటు ఖండించనూ లేదు. దీంతో ఈ సినిమాపై హైప్స్ ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్‌లో వీరిద్దరి పాత్రలకు సంబంధించిన ఎలాంటి సన్నివేశాలను చిత్రీకరించలేదని తెలుస్తోంది. దీంతో అసలు వీరిద్దరూ సినిమాలో ఉన్నారా? లేక తర్వాతి షెడ్యూల్‌లో అయిన వారి ఎంట్రీ ఉంటుందా? లేదా లేక ఇవన్నీ వ్యర్థ ప్రచారాలేనా అనే చర్చ మొదలైంది.
మరోవైపు ‘స్పిరిట్’లో స్పెషల్ సాంగ్‌కు కూడా కీలక స్థానం ఉండనున్నట్లు తెలుస్తోండగా ఈ పాట కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ను చిత్రబృందం పరిశీలిస్తున్నట్లు టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘స్పిరిట్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా షూటింగ్ ముందుకు సాగుతున్న కొద్దీ నటీనటులు, కథకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.