Chiru- Balayya: స్టార్ హీరోలకు సపోర్ట్ గా వారసురాళ్లు..
ABN, Publish Date - Jan 13 , 2026 | 04:32 PM
గత సంవత్సరం డిసెంబర్ లో వచ్చిన బాలకృష్ణ (Nandamuri Balarkishna) 'అఖండ-2- తాండవం (Akhanda 2 Thaandavam)', ఇప్పుడు సంక్రాంతికి వచ్చి సందడి చేస్తోన్న చిరంజీవి (Chiranjeevi) 'మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu)' సినిమాలు అభిమానులను మాత్రం విశేషంగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి.
Chiru- Balayya: గత సంవత్సరం డిసెంబర్ లో వచ్చిన బాలకృష్ణ (Nandamuri Balarkishna) 'అఖండ-2- తాండవం (Akhanda 2 Thaandavam)', ఇప్పుడు సంక్రాంతికి వచ్చి సందడి చేస్తోన్న చిరంజీవి (Chiranjeevi) 'మన శంకరవరప్రసాద్ గారు (Mana Shankara Vara Prasad Garu)' సినిమాలు అభిమానులను మాత్రం విశేషంగా ఆకట్టుకున్నాయనే చెప్పాలి. ఈ రెండు చిత్రాల్లోనూ ఆ టాప్ హీరోస్ కూతుళ్ళు పాలు పంచుకోవడం విశేషం. బాలకృష్ణ 'అఖండ-2' చిత్రానికి ఆయన చిన్నకూతురు తేజస్విని (Tejaswini) నిర్మాణ భాగస్వామి. అదే తీరున చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'కు ఆయన పెద్ద కూతురు సుస్మిత (Susmitha Konidela) నిర్మాతల్లో ఒకరిగా వ్యవహరించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ ఇద్దరమ్మాయిల గురించి సినీజనం చర్చించుకుంటూ ఉండడం విశేషంగా మారింది. ఈ ఇద్దరమ్మాయిలు తమ తండ్రుల్లో అసలైన ఫైర్ ను జెన్ జెడ్ సైతం ఆకర్షించేలా బయట పెట్టారని టాలీవుడ్ జనం భావిస్తున్నారు.
బాలకృష్ణ అంటేనే పవర్ ఫుల్ రోల్స్ కు కేరాఫ్ అడ్రస్ గా భావిస్తారు... ఆయనంటే కొందరు భయపడుతూ ఉంటారు. నిజానికి బాలయ్య పరిచయస్థులతో ఎంతో జోవియల్ గా ఉంటారని చాలామందికి తెలియదు... అయితే ఆయనలోని చిలిపితనాన్ని, మంచిమనసును అందరికీ అర్థమయ్యేలా ఆవిష్కరించిన వేదిక 'ఆహా' ఓటీటీ ప్లాట్ ఫామ్ అనే చెప్పాలి... అందులో బాలయ్య నిర్వహించిన 'అన్ స్టాపబుల్' ప్రోగ్రామ్ దేశవ్యాప్తంగా విశేషాదరణ చూరగొంది... అసలు బాలయ్య ఆ ప్రోగ్రామ్ అంగీకరించడానికి కారణం చిన్నకూతురు తేజస్విని అనే చెప్పాలి... ఆ షో నిర్వహణలో తేజస్విని కూడా పాలుపంచుకున్నారు. ఆ తరువాత తండ్రి సినిమాల కథల ఎంపిక విషయంలోనూ తేజస్విని శ్రద్ధ వహిస్తున్నారని వినిపిస్తోంది. అంతేకాదు బాలయ్య 'డాకూ మహరాజ్' మూవీ ఎంపికలోనూ తేజస్విని జోక్యం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య 'అఖండ-2'లో తేజస్విని నిర్మాణ భాగస్వామి కూడా అయ్యారు.
చిరంజీవికి కొన్ని చిత్రాల నుంచీ స్టైలిస్ట్ గా పనిచేశారు ఆయన పెద్ద కూతురు సుస్మిత... తన తండ్రిని అభిమానులు ఎలా చూడాలని ఆశిస్తున్నారో అధ్యయనం చేసి అందుకు అనువుగా చిరంజీవి బాడీ లాంగ్వేజ్ ను మార్చేశారు సుస్మిత... అంతేకాదు ఆయనను మళ్ళీ 'ఘరానామొగుడు, రౌడీ అల్లుడు' నాటి చిరంజీవిలా తయారు చేయడంలోనూ సుస్మిత కృషి ఉంది... 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రానికి సుస్మిత నిర్మాణ భాగస్వామి మాత్రమే కాదు, చిరంజీవి వింటేజ్ లుక్ కు అసలు కారకురాలు ఆమెనే అంటున్నారు..
ఇలా అటు బాలయ్యకు, ఇటు చిరంజీవికి వారి కూతుళ్ళు పెద్ద ప్లస్ అయ్యారని పరిశీలకుల మాట... ఈ టాప్ హీరోస్ ఫ్యాన్స్ కోరుకొనే అంశాలను వారి కూతుళ్ళు అధ్యయనం చేసి ఇద్దరూ సంక్రాంతికి హిట్ పట్టేశారని ఫ్యాన్స్ అంటున్నారు... గత సంవత్సరం బాలయ్య 'డాకూ మహరాజ్'కు తేజస్విని సపోర్ట్ - ఇప్పుడు చిరంజీవి 'మన శంకరవరప్రసాద్ గారు'కు సుస్మిత మద్దతు కలసి వచ్చాయని సినీజనం భావిస్తున్నారు... రాబోయే ఈ ఇద్దరు టాప్ స్టార్స్ మూవీస్ కు వారి కూతుళ్ళు ఏ తీరున కృషి చేస్తారో చూడాలి.