సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'పౌర్ణమి' పాటకు చైనా డ్యాన్సర్ అద్భుత నాట్యం..వీడియో వైరల్

ABN, Publish Date - Sep 08 , 2026 | 04:32 PM

ళ, సంగీతం భౌగోళిక సరిహద్దులను, భాషా పరిమితులను చెరిపేస్తాయని మరోసారి రుజువైంది. దాదాపు రెండు పదుల ఏళ్ల క్రితం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, త్రిష కాంబినేషన్‌లో వచ్చిన క్లాసిక్ చిత్రం పౌర్ణమి.

Pournami

కళ, సంగీతం భౌగోళిక సరిహద్దులను, భాషా పరిమితులను చెరిపేస్తాయని మరోసారి రుజువైంది. దాదాపు రెండు పదుల ఏళ్ల క్రితం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas), త్రిష కాంబినేషన్‌లో వచ్చిన క్లాసిక్ చిత్రం పౌర్ణమి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించకపోయినా, దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు మాత్రం సంగీత ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేశాయి. ముఖ్యంగా ఈ చిత్రంలోని భరత వేదముగా అనే పాటను తెలుగువారు ఎప్పటికీ మర్చిపోరు. తాజాగా ఈ సాంగ్ కు చైనాకు చెందిన మీరా వాంగ్ అనే శాస్త్రీయ నృత్య కళాకారిణి చేసిన కూచిపూడి అభినయం ప్రస్తుతం నెట్టింట సంచలనం సృష్టిస్తోంది.


తెలుగు భాషతో ఎలాంటి సంబంధం లేకపోయినా, ఈ పాటకు ఆమె పలికించిన భావాలు, అద్భుతమైన ముద్రలు, హావభావాలు తెలుగు ఆడియన్స్‌తో పాటు సినీ ప్రముఖులను కూడా ఆకట్టుకుంటున్నాయి. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, మీరా వాంగ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా భారతదేశంలో అడుగుపెట్టలేదట. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురానికి చెందిన ప్రముఖ నాట్య గురువు అలా వేణుగోపాల్ వద్ద ఆమె ఆన్‌లైన్‌లో శిక్షణ పొందుతూ కూచిపూడి నృత్య రీతులను నేర్చుకుంటుంది. స్వదేశంలోనే ఉంటూ మన సాంప్రదాయ నృత్యాన్ని ఇంత క్షుణ్ణంగా అభ్యసించి ప్రదర్శించడం పట్ల నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.


గతంలో కూడా ఈ చైనా కళాకారిణి మాయాబజార్ చిత్రంలోని అహా నా పెళ్లంట వంటి పాత తరం క్లాసిక్ సాంగ్స్‌కు నాట్యం చేసి తెలుగు ఫాలోవర్లను సంపాదించుకుంది. ఇప్పుడు ప్రభాస్ మూవీ సాంగ్‌తో ఆమె మరోసారి గ్లోబల్ వైడ్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చింది. భారతీయ సంస్కృతిని గౌరవిస్తూ, కూచిపూడి కళను విదేశాల్లో ప్రచారం చేస్తున్న మీరా వాంగ్ కృషికి నెటిజన్లతో పాటు ప్రభాస్ అభిమానులు జోహార్లు అర్పిస్తున్నారు.

Updated Date - Sep 08 , 2026 | 04:33 PM