సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మొన్న 'కామాఖ్య'... నేడు 'చైనా పీస్'... సెన్సార్ అభ్యంతరం!

ABN, Publish Date - Aug 01 , 2026 | 05:18 PM

'చైనా పీస్' సినిమా పేరు మారింది. ఇప్పుడీ సినిమాకు 'సీక్రెట్ సోల్జర్' అనే పేరు పెట్టారు. సెప్టెంబర్ లో మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు దర్వకుడు అక్కి విశ్వనాథ రెడ్డి తెలిపారు.

China Piece Movie

నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా నటించిన 'చైనా పీస్' సినిమా టైటిల్ కు సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దాంతో ఇప్పుడీ సినిమా పేరును 'సీక్రెట్ సోల్జర్'గా మార్చారు.

అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో యూనిక్ స్పై డ్రామాగా దీనిని మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై నిర్మించారు. కమల్ కామరాజు, రఘు బాబు, 'రంగస్థలం' మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. యూనిక్ కాన్సెప్ట్, ఆకట్టుకునే ప్రెజెంటేషన్, యాక్షన్, థ్రిల్, హ్యుమర్ ఎలిమెంట్స్‌తో విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్ అధికారులు పేరు మార్చమని సలహా ఇచ్చినట్టు సమాచారం. దాంతో కథానుగుణంగా 'సీక్రెట్ సోల్జర్' అనే పేరును ఖరారు చేశారని తెలుస్తోంది. సెప్టెంబర్ లో ఈ సినిమాను జనం ముందుకు తీసుకు రాబోతున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సురేష్ రగుతు సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించగా, మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్‌గా పనిచేశారు. కార్తీక్‌ రోడ్రిగ్జ్‌ ఈ సినిమాకు సంగీతం అందించారు.


'కామాఖ్య' చిత్రం టైటిల్ కూ సెన్సార్ వారు అభ్యంతరం పెట్టడంతో మేకర్స్ చివరి నిమిషంలో 'కర్మాఖ్య'గా మార్చి, జూలై 31న విడుదల చేశారు. ఈ యేడాది ఇలా టైటిల్స్ మార్చుకున్న సినిమాలు దాదాపు ఐదారు వరకూ ఉన్నాయి. ఆ జాబితాలోకి తాజాగా 'చైనా పీస్' కూడా చేరింది.

ఇవి కూడా చదవండి:

Lenin OTT: అయ్యగారి సినిమా ఈసారి ఆలస్యం కాకుండానే ఓటీటీకి..

జూలైలో అనువాద చిత్రాల హవా...

అంజలీదేవి నుంచి సాయి పల్లవి వరకు.. వెండితెర సీతమ్మల జర్నీ!

Updated Date - Aug 01 , 2026 | 05:59 PM