Balan: మంచి సినిమాకు ఎప్పుడూ స్పేస్ ఉంటుంది: 'బాలన్' దర్శకుడు చిదంబరం
ABN, Publish Date - Jun 20 , 2026 | 06:53 PM
'మంజుమ్మల్ బాయ్స్' మూవీ దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన తాజా చిత్రం 'బాలన్: ది బోయ్'కు చక్కని స్పందన లభిస్తోంది. త్వరలో తాను తెలుగులోనూ ఓ సినిమా చేయబోతున్నట్టు చిదంబరం తెలిపారు.
గ్రాండియర్ ఫిలిం మేకింగ్ కు మారుపేరైన కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన మూవీ 'బాలన్: ది బాయ్'. ఈ చిత్రానికి 'ఆవేశం' దర్శకుడు జితూ మాధవన్ స్క్రిప్ట్ అందించారు. 'మంజుమ్మెల్ బాయ్స్' దర్శకుడు చిదంబరం దీనిని తెరకెక్కించారు. శుక్రవారం ఈ సినిమా ప్రధాన భారతీయ భాషల్లో విడుదలైంది. తెలుగులో ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ శైలజా దేశాయి ఫెన్ మాట్లాడుతూ, -'తేస్పియన్ ఫిలింస్‌లో మొదటి చిత్రమిది. నిర్మాతలుగా మాకు తొలి ప్రయత్నమైనా మమ్మల్ని డైరెక్టర్ చిదంబరం నమ్మారు. చిదంబరంతో పాటు డైరెక్టర్ ప్రియదర్శన్ వల్లే మా తెస్పియన్ ఫిలింస్ సంస్థ ఏర్పాటైంది. ఈ చిత్రంతో పాటు మేం హిందీలో ప్రియదర్శన్ దర్శకత్వంలో 'హైవాన్' అనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాం. కేవీఎన్ ప్రొడక్షన్స్ నుంచి ప్రొడ్యూసర్ వెంకట్ మాకు పూర్తి సహకారం అందించారు. మమ్మల్ని మా ప్యాషన్‌ను నమ్మి వెన్నంటి నిలబడ్డారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాను' అని అన్నారు.
చైల్డ్ ఆర్టిస్ట్ ముహమ్మద్ జినాన్ మాట్లాడుతూ, 'ఈ సినిమా చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మా సినిమాపై ఇలాగే మీ ఆదరణ కొనసాగుతుందని నమ్ముతున్నాం. ఈ సినిమా ప్రేక్షకులందరికీ ఒక యూనిక్ ఎక్సిపీరియన్స్ ఇస్తుంది. తప్పకుండా థియేటర్స్ లో చూడాలని కోరుతున్నాను' అని అన్నారు. మరో చైల్డ్ ఆర్టిస్ట్ ఆది శేషన్ మాట్లాడుతూ, 'ఈ సినిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన మా డైరెక్టర్ చిదంబరం గారికి థ్యాంక్స్. మా చిత్రాన్ని చూసిన వారంతా చాలా బాగుందంటూ అప్రిషియేట్ చేస్తున్నారు. మీరు కూడా మా సినిమాను చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను' అని అన్నాడు. యాక్టర్ జీన్ పాల్ లాల్ మాట్లాడుతూ, 'ఈ సినిమా మలయాళంలో మంచి విజయాన్ని సాధించింది. తెలుగులోనూ మీరంతా ఆదరిస్తారని ఆశిస్తున్నాం. ఇదొక గొప్ప చిత్రం. ఈ సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను' అని అన్నారు.
'బాలన్' మూవీలో తల్లి పాత్రను పోషించిన ఫర్జాన పాలతింగల్ మాట్లాడుతూ, 'మా మూవీని సపోర్ట్ చేసేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. మీరు మా సినిమా చూసి, ఇచ్చే ఫీడ్ బ్యాక్ తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఈ చిత్రంలో నేను చేసిన క్యారెక్టర్ కు చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ స్క్రిప్ట్ విన్నప్పుడే నా ఫస్ట్ మూవీలో ఇలాంటి మంచి క్యారెక్టర్ వచ్చిందని సంతోషించాను. ఈ సినిమా కోసం నేను ప్రత్యేకంగా ప్రిపేర్ కావాల్సిన అవసరం రాలేదు. ఆ స్క్రిప్ట్ లోనే ఆ స్ట్రెంత్ ఉంది. తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ గుడ్ మూవీస్‌ను ఎంకరేజ్ చేస్తుంటారు. 'బాలన్: ది బాయ్' వంటి ఒక సరికొత్త తరహా చిత్రాన్ని మీరు విజయవంతం చేస్తారని నమ్ముతున్నాం' అని అన్నారు.
తెలుగులోనూ చిదంబరం సినిమా!
డైరెక్టర్ చిదంబరం మాట్లాడుతూ, 'తెలుగు ఆడియెన్స్ సినిమాను ఎంజాయ్ చేస్తారు. సెలబ్రేట్ చేస్తారు. వారికి ఏ భాష సినిమా అనేది ఇంపార్టెంట్ కాదు. మంచి కంటెంట్ ఉంటే ఆదరిస్తారు. అలాగే మా 'మంజుమ్మెల్ బాయ్స్' సినిమాపై మీరు ఎంతో ప్రేమ చూపించారు. ఇప్పుడు ఆ నమ్మకంతోనే ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీని మీ ముందుకు తీసుకొచ్చాం. మీరు సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం. మంచి సినిమాలకు ఎప్పుడూ స్పేస్ ఉంటుంది, ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ విషయాన్ని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేసింది. నేను, జీతు చూసిన అనేక రియల్ లైఫ్స్ ఆధారంగా ఈ కథను రెడీ చేశాం. మా సినిమాలో చూపించినటువంటి వాళ్లు ఎంతోమంది ఈ ప్రపంచంలో ఉన్నారు. కానీ మనం వారిని చూడలేకపోతున్నాం. నేను తెలుగుతో పాటు తమిళంలో సినిమా చేయాలి. నాకు తెలుగు ఇండస్ట్రీ అంటే ఇష్టం. తెలుగులో ఒక మూవీ చర్చల దశలో ఉంది. దర్శకుడిగా నాపై ప్రేక్షకులు ఒక నమ్మకం పెట్టుకుంటారు. ఆ నమ్మకాన్ని కాపాడేలా సినిమాలు రూపొందిస్తాను. మా మూవీని డిస్ట్రిబ్యూట్ చేసిన అన్నపూర్ణ సంస్థకు, ప్రమోట్ చేసిన నాగ చైతన్యకు థ్యాంక్స్. ఈ స్టోరీనే నన్ను ఇన్స్ పైర్ చేసింది. టీమ్ అంతా ఒక్కటిగా ప్యాషనేట్ గా పనిచేసేలా చేసింది. మా సినిమాకు స్టోరీనే పెద్ద స్ట్రెంత్ అని భావిస్తున్నాను' అని అన్నారు.
ఇవి కూడా చదవండి:
‘OG 2’లో ఊహించని మార్పులు.. షూటింగ్ డేట్ ఫిక్స్!
పవన్ అభిమాని నిరంజన్‌ను ఈ రోజే కలవడానికి కారణమిదే: బండ్ల గణేష్
మాట నిలబెట్టుకున్న థమన్.. ఎంత గొప్ప మనసో!