Chennai Lovestory Trailer: బేబీని మించి ఉందిగా.. కల్ట్ బొమ్మ
ABN, Publish Date - Jul 18 , 2026 | 07:57 PM
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), గౌరీ ప్రియ (Gouri Priya) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం చెన్నై లవ్ స్టోరీ (Chennai Lovestory).
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram), గౌరీ ప్రియ (Gouri Priya) ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం చెన్నై లవ్ స్టోరీ (Chennai Lovestory). కలర్ ఫోటో, బేబీ వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను అందించిన మాస్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఎస్‌కేఎన్, సాయి రాజేష్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది.
స్టీవెన్(కిరణ్ అబ్బవరం) రైటర్ అవ్వాలని హైదరాబాద్ వదిలి చెన్నైకి వెళ్లి అక్కడ సినిమాలలో ఛాన్స్ కోసం ప్రయత్నిస్తూ ఫ్రెండ్స్ రూమ్ లో ఉంటాడు. ఆ రూమ్ కి ఎదురుగా కావ్య(శ్రీ గౌరిప్రియ) ఉంటుంది. ఆమెకు బ్రేకప్ అవ్వడంతో మందుకు బానిసగా మారుతోంది. ఆమెను ఎలా అయినా మార్చాలని స్టీవెన్ నానాకష్టాలు పడతాడు. చివరికి స్టీవెన్ స్నేహంతో కావ్య నార్మల్ అయ్యి అతడినే ప్రేమిస్తుంది. వీరి ప్రేమ కథ మొదలయ్యాక.. వీరి జీవితంలో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. అవేంటి.. ? స్టీవెన్.. కావ్యను ఎందుకు అనుమానించాడు.. ? చివరికి వీరిద్దరూ కలిశారా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ట్రైలర్ మొత్తం అద్బుతమైన డైలాగ్స్ తో నింపేశారు. ఒక్కో డైలాగ్ ఒక్కో డైమండ్ అని చెప్పొచ్చు. 'ప్రతి ప్రేమ కథ ఒకేలా ఉంటే చరిత్ర కూడా నచ్చదండి.. నమ్మని వాడికి ఈ కథ ఒక అబద్ధం, నమ్మగలిగితే అదే అద్భుతం', 'ఈరోజు నుంచి మీరు నా దేవత నేను మీ బానిస' ఇలాంటి డైలాగ్స్ అదిరిపోయాయి. కిరణ్ అబ్బవరం లుక్, క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్‌గా కనిపిస్తుండగా, గౌరీ ప్రియ సినిమాకు బలం అని తెలుస్తోంది. ఇక మణిశర్మ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్‌కేఎన్, సాయి రాజేష్‌ల మార్క్ ఎమోషన్స్, లవ్ ట్రాక్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. జులై 24 న చెన్నై లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో కిరణ్ అబ్బవరం ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.