‘చీన్ టపాక్ డుండుం’ నుంచి ‘మరొక్కసారి’.. ఆకట్టుకుంటున్న ఫీల్ గుడ్ లవ్ సాంగ్!

ABN , Publish Date - Nov 17 , 2026 | 12:44 PM

శ్రీనివాస్ గవిరెడ్డి, బ్రిగిడ సాగా జంటగా నటిస్తున్న ‘చీన్ టపాక్ డుండుం’ సినిమా నుంచి ‘మరొక్కసారి’ ఫీల్ గుడ్ లవ్ సాంగ్ విడుదలైంది. కార్తీక్ గానం, పీఆర్ సంగీతం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Cheen Tapak Dum Dum movie

శ్రీనివాస్ గవిరెడ్డి, బ్రిగిడ సాగా ప్రధాన పాత్రల్లో వై.ఎన్. లోహిత్ తెరకెక్కించిన చిత్రం ‘చీన్ టపాక్ డుండుం’. ఈ సినిమాను విలేజ్ టాకీస్ బ్యానర్ మీద శ్రీను నాగులపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజికల్ ప్రమోషన్స్‌ ను మేకర్స్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే ‘మరొక్కసారి’ అంటూ సాగే ఫీల్ గుడ్, లవ్ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటకు తిరుపతి జవ్వాన సాహిత్యం అందించగా, పిఆర్ (పెద్దపల్లి రోహిత్) బాణీ సమకూర్చారు. ఇక మెలోడీ పాటలకు కేరాఫ్ అడ్రస్ అయిన సింగర్ కార్తీక్ గాత్రం ఈ పాటను మరో స్థాయికి తీసుకు వెళ్లాయి.


‘మరొక్కసారి’ అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. కొరియోగ్రాఫర్ విష్ణు ప్రెజర్వర్ కంపోజ్ చేసిన హుక్ స్టెప్ కూడా బాగుంది. లీడ్ పెయిర్ ఫ్రెష్‌గా కనిపిస్తున్నారు. గ్రామీణ వాతావరణాన్ని ఈ పాటలో చక్కగా చూపించారు. ఇదొక విలేజ్, లవ్, కామెడీ ఎంటర్టైనర్‌గా రాబోతోందని పాటని చూస్తే అర్థం అవుతోంది. త్వరలోనే మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్‌ని ప్రకటించనున్నారు. ఈ ‘చీన్ టపాక్ డుండుం’ మూవీకి సెంథిల్ కుమార్ కెమెరామెన్‌గా, ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్నారు. పీఆర్ పాటలకు సంగీతం అందింస్తుండగా.. సురేష్ బొబ్బిలి నేపథ్య సంగీతాన్ని అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

James Bond 007: కొత్త జేమ్స్‌బాండ్‌.. అదిరిపోయాడు

Diljit Dosanjh: హిందుస్థాన్ ఎవరి సొత్తూ కాదు.. దిల్జీత్ దొసాంజ్ సంచలన వ్యాఖ్యలు

అనిరుధ్ స్వరాలకు..15 వసంతాలు

Updated Date - Nov 17 , 2026 | 12:55 PM