Chandrayaan: ఎక్కాలు రాకుండా రాకెట్ కు కావాల్సిన లెక్కలు ఎలా..
ABN, Publish Date - Oct 03 , 2026 | 05:07 PM
శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని జంటగా నటిస్తున్న చిత్రం 'చంద్రయాన్'. రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని జంటగా నటిస్తున్న చిత్రం 'చంద్రయాన్'. రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్ పై ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. ఈ నెల 30న రాబోతుంది. శనివారం ఈ సినిమా గ్లింప్స్ ను హైదరాబాద్ లో విడుదల చేశారు. వేణు స్వామి ఈ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు.
డైరెక్టర్ శ్రీనాథ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ 'మందమర్రి టు చందమామ, ఆగేది కాదు ఇది ఫుల్ హంగామా. ఈ హంగామా మిమ్మల్ని 2 గంటల 15 నిమిషాలు ఆగకుండా నవ్విస్తుంది. గ్లింప్స్ చూసి మా యాక్టర్స్ అమాయకులు అంటున్నారు. కానీ వీళ్లు అమాయకులే కాదు ధైర్యవంతులు కూడా. ఎవరైనా వీళ్లకు పాకిస్తాన్ మనల్ని ఇబ్బంది పెడుతుంది అంటే దాని మీద బాంబులు వేసి వస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది ఆలోచించరు. అంత ధైర్యవంతులు. వీళ్లు ఏమీ తెలియకుండా రాకెట్ ఎలా చేశారు, స్పేస్ కు ఎలా వెళ్లారు. ఎక్కాలు రాకుండా రాకెట్ కు కావాల్సిన లెక్కలు ఎలా చేశారు అనేది సినిమాలో చూడబోతున్నారు' అన్నారు.
హీరోయిన్ స్వప్న ప్రియదర్శిని మాట్లాడుతూ - తెలుగు సినిమాల్లో నటించాలని కలగంటూ వచ్చాను. ఈ చిత్రంతో నా కల నిజమైంది. తెలుగు సినిమాను మన దేశమే కాదు ప్రపంచమంతా ఇష్టపడుతోంది. ఇలాంటి ఇండస్ట్రీలో భాగమవడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో బిందు అనే పాత్రలో నటించాను. నా క్యారెక్టర్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ నెల 30న థియేటర్స్ లోకి వస్తున్న మా సినిమాను చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నా' అన్నారు.
నిర్మాత ప్రవీణ్ మొలక మాట్లాడుతూ 'డైరెక్టర్ శ్రీనాథ్ ఈ కథ చెబుతున్నప్పుడు రెండున్నర గంటలు ఒక ఫ్రెండ్ తో సరదాగా మాట్లాడుకుంటే ఎంత హ్యాపీగా ఫీలవుతామో అలా ఫీలయ్యాను. కుటుంబమంతా కలిసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. ఎలాంటి అసభ్యత ఉండదు. థియేటర్ లో ప్రతి ప్రేక్షకుడు నవ్వుకుంటాడని గ్యారెంటీగా చెప్పగలను' అన్నారు.
సమర్పకుడు వేణు ఊడుగుల మాట్లాడుతూ 'ఈ సినిమా చూసిన తర్వాత ఈ చిత్రంలో నేను పార్ట్ కావాలని అనిపించింది. ఈ టీమ్ నిజాయితీగా, ప్యాషన్ తో ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారని నమ్మాను. ఇది రెగ్యులర్ రొటీన్ సినిమా కాదు. ఒక అర్థవంతమైన సినిమా. అలాగే ఈ చిత్రాన్ని కమర్షియల్ ఇంపాక్ట్ ఉన్న ట్రీమ్ మెంట్ తో రూపొందించారు. అమాయకులైన ఒక నలుగురు యువకులు రాకెట్ తయారు చేసుకుని స్పేస్ లోకి వెళ్లడం అనే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. సైన్స్ తెలియకుండా, పెద్దగా చదువుకోకుండా ఏదో సాధించాలనే తపనతో నలుగురు యువకులు రాకెట్ తయారు చేయండి, స్పేస్ లోకి వెళ్లడం వంటి అంశాలు ప్రేక్షకులకు కొత్త ఫీల్ కలిగిస్తాయి. స్పేస్ లోకి వెళ్లేందుకు రాకెట్ తయారు చేసి స్పేస్ లోకి లాంఛ్ చేసే క్రమంలో చాలా ఫన్ క్రియేట్ అవుతుంది. ఈ జర్నీలో వాళ్లు ఎదుర్కొన్న ఇబ్బందులు, తెలుసుకున్న విషయాలను అద్భుతంగా తెరకెక్కించారు దర్శకుడు' అన్నారు.
వేణు స్వామి మాట్లాడుతూ 'ఈ మధ్య చిన్న చిత్రాలు తెలుగులో మంచి విజయాలు సాధిస్తున్నాయి. ఈ సినిమా కూడా అలాంటి హిట్ అవుతుంది. ఎందుకంటే గొప్ప నక్షత్రాల్లో పుట్టిన వారు ఈ సినిమా టీమ్ లో ఉన్నారు. మనం ప్రతి రోజూ చంద్రుడు, సూర్యుడిని చూస్తుంటాం. ఆయన ప్రొడ్యూసర్ గా మారితే చంద్రుడు, డైరెక్టర్ గా మారితే సూర్యుడు అనుకోవచ్చు. మా కాంబోలో త్వరలో ఒక పెద్ద సినిమా చేయబోతున్నాం. కృతిక నక్షత్ర యుక్త పౌర్ణమి కార్తీకమాసం అక్టోబర్ 30న రిలీజ్ కాబోతోంది కాబట్టి ఈ సినిమా పెద్ద విజయం సాధించబోతోంది' అన్నారు.