బోల్డ్ సీన్లు.. ఎక్స్‌పోజింగ్ క్లాత్స్.. రంభ ఊర్వశి మేనక ఆగిపోయినట్లేనా

ABN , Publish Date - Aug 30 , 2026 | 03:35 PM

కామెడీ కింగ్ అల్లరి నరేష్ నటించిన రంభ ఊర్వశి మేనక చిత్రం సెన్సార్ చిక్కులో పడింది. ఈ సోషియో-ఫాంటసీ కామెడీ చిత్రానికి చంద్రమోహన్ చింతడ దర్శకత్వం వహించగా అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Ramba Oorvasi Menaka

కామెడీ కింగ్ అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన రంభ ఊర్వశి మేనక ( Ramba Oorvasi Menaka) చిత్రం సెన్సార్ చిక్కులో పడింది. ఈ సోషియో-ఫాంటసీ కామెడీ చిత్రానికి చంద్రమోహన్ చింతడ దర్శకత్వం వహించగా అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా, నిమ్మకాయల ప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో అల్లరి నరేష్ సరసన సురభి నటించగా.. రాశీ సింగ్, విష్ణుప్రియ, ప్రీషా టైటిల్ రోల్ పోషించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సెప్టెంబర్ 4 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో అల్లరి నరేష్ ప్రమోషన్స్ స్పీడు కూడా పెంచాడు.


అయితే, తాజాగా ఈ చిత్ర విడుదలపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాలో రంభ, ఊర్వశి, మేనక పాత్రలు ధరించిన దుస్తులు మితిమీరిన గ్లామర్‌తో ఉన్నాయని సెన్సార్ సభ్యులు పేర్కొన్నారు. ఈ కారణంగా రంభ ఊర్వశి మేనక సినిమా విడుదలను సెన్సార్ బోర్డు ప్రస్తుతానికి నిలిపివేసినట్లు టాక్ నడుస్తోంది. అప్సరల లుక్స్‌కి సంబంధించిన కొన్ని దృశ్యాలు, దుస్తుల రూపకల్పన వివాదాస్పదంగా మారాయి. దేవకన్యలు.. ఒంటిపై దుపట్టాలు లేకుండా.. నడుము భాగాన్ని ఎక్కువగా చూపించడంతో.. అది చూడడానికి చాలా ఎబెట్టుగా ఉందని, ఫ్యామిలీతో కలిసి వెళ్ళే సినిమా కావడంతో.. ఇలాంటి దుస్తులను అంగీకరించమని సెన్సార్ బోర్డ్ చెప్పినట్లు సమాచారం.


రంభ ఊర్వశి మేనక దుస్తులను మార్చాలని, లేకపోతే ఈ సినిమా రిలీజ్ అవ్వదని సెన్సార్ చెప్పిందని టాక్. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఇప్పటివరకు చిత్రబృందం ఎలాంటి స్పందన ఇవ్వలేదు. ఏదిఏమైనా ఇంకో వారం రోజుల్లో సినిమా రిలీజ్ ఉండగా ఇలాంటి వివాదం రావడం కొంచెం కష్టమే. సెన్సార్ అవ్వకపోతే సినిమా ఆగిపోతుంది. మరి చిత్రబృందం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

Updated Date - Aug 30 , 2026 | 03:35 PM