సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చెర్రీపై అభినందనల జల్లు

ABN, Publish Date - Mar 27 , 2026 | 01:55 PM

స్టార్ హీరో రామ్ చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా సినిమా రంగానికి చెందిన తారలు, దర్శకులు అతనికి శుభాకాంక్షలు తెలియచేశారు. తాజాగా విడుదలైన 'పెద్ది' టీజర్‌ బాగుందంటూ అభినందనలు తెలియచేస్తున్నారు.

Ram Charan

మొన్నటి వరకూ మెగా పవర్ స్టార్ అని అభిమానంగా పిలుచుకున్న ఫ్యాన్స్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ అని గర్వంగా చెబుతున్నారు. అయితే... ఈ బిరుదుల్ని మాత్రం తన పేరు ముందు వాడొద్దని రామ్‌చరణ్‌ వినయంగా చెబుతున్నారు. మార్చి 27వ తేదీ రామ్ చరణ్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఉదయం నుండి సోషల్ మీడియాలో సినిమా రంగానికి చెందిన పలువురు చెర్రీకి శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. ఇదే సమయంలో 'పెద్ది' నుండి వచ్చిన పహిల్వాన్ టీజర్‌ ను చూసిన వారు... అభినందనలు తెలియచేస్తున్నారు.


మెగా చిరంజీవి తన నట వారసుడిపై తనదైన శైలిలో ప్రశంసల జల్లు కురిపించారు. చరణ్‌ తో ఉన్న కొన్ని ఫోటోలను జత చేస్తూ... చరణ్‌ బాబు.. చిన్నప్పుడు నా చెయ్యి పట్టుకుని నడిచిన నువ్వు, ఇవాళ ఎంతోమందికి ప్రేరణగా మారడం నాకు ఎంతో గర్వంగా ఉంది. సినిమా, వ్యక్తిగత జీవితాన్ని నువ్వు సమతుల్యం చేసుకునే విధానం, కుటుంబం పట్ల చూపించే బాధ్యత, దేవునిపై నీకున్న నమ్మకం, నీ క్రమశిక్షణ, నీ విలువలు.... వీటిని చూసినప్పుడల్లా నీపై నా ప్రేమ, గౌరవం పెరుగుతూనే ఉంది. దేవుడి ఆశీర్వాదం, అభిమానుల ప్రేమతో నువ్వు మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాను' అని పేర్కొన్నారు. అలానే చరణ్‌ బాబాయ్‌, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ సైతం జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.


రామ్ చరణ్‌ కు ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపిన వారి జాబితా చాలానే ఉంది. తోటి హీరోలు అల్లు అర్జున్, వెంకటేశ్‌, మంచు మనోజ్, వరుణ్‌ తేజ్, ఆది సాయికుమార్, నారా రోహిత్‌, వివేక్ ఓబెరాయ్‌ తదితరులతో పాటు దర్శకులు అనిల్ రావిపూడి, మెహర్ రమేశ్‌, బాబీ, సంపత్ నంది, వేణు ఊడుగుల, సాంకేతిక నిపుణులు రత్నవేలు, ఎ.ఆర్. రెహమాన్, కోన వెంకట్, హీరోయిన్ జాన్వీ కపూర్ వంటి వారు శుభాకాంక్షలు తెలిపారు. అలానే పలు నిర్మాణ సంస్థలు సైతం రామ్ చరణ్‌ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశాయి.

Updated Date - Mar 27 , 2026 | 02:12 PM