Suriya: ఈ దీపావళిని.. ‘సీన్’తో సెలబ్రేట్ చేసుకుందాం
ABN, Publish Date - Nov 03 , 2026 | 05:57 AM
‘వీరభద్రుడు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తర్వాత ఇ లాంటి చిత్రంతో మీ ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ దీపావళిని ‘సీన్’ (Scene)తో సెలబ్రేట్ చేసుకుందాం అని హీరో సూర్య అన్నారు.
‘వీరభద్రుడు’, ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ తర్వాత ఇ లాంటి చిత్రంతో మీ ముందుకు వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు జీతూ మాధవన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆవేశం’, ‘రోమాంచం’ లాగే ఈ సినిమా కూడా అద్భుతంగా ఉంటూ మీ అందరి అంచనాలు అందుకుంటుంది. ఈ దీపావళిని ‘సీన్’ (Scene)తో సెలబ్రేట్ చేసుకుందాం అని హీరో సూర్య (Suriya)అన్నారు.
ఆయన కథానాయకుడిగా జీతూ మాధవన్ (Jithu Madhavan) తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సీన్’. సూర్య, జ్యోతిక సంయుక్తంగా నిర్మించారు. ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో ఈ సినిమాను ఎన్వీఆర్ సినిమాస్ ద్వారా ఎన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ ‘ఈ సినిమా సూర్యకు హ్యాట్రిక్ హిట్ అవుతుంది. ఆయన కెరీర్లోనే ఓ గొప్ప సినిమాగా నిలిచిపోతుంది’ అని చెప్పారు. చిత్రం కథానాయిక నజ్రియా నజీమ్ (Nazriya Nazim) మాట్లాడుతూ ‘ఇందులో మాయ అనే స్ట్రాంగ్ కేరెక్టర్ పోషించాను’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు వెంకీ అట్లూరి, నిర్మాత సుప్రియ యార్లగడ్డ తదితరులు పాల్గొన్నారు.