Cat: బుచ్చిబాబు వదిలిన 'CAT' ఫస్ట్ లుక్
ABN, Publish Date - Jan 27 , 2026 | 04:23 PM
జీవి నాయుడు(Jeevi Naidu), వీజే బాలు , లావణ్య , కళ్యాణి రాణి (Kalyani Rani) కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం 'CAT'.
జీవి నాయుడు(Jeevi Naidu), వీజే బాలు , లావణ్య , కళ్యాణి రాణి (Kalyani Rani) కీలక పాత్రధారులుగా తెరకెక్కుతున్న చిత్రం 'CAT'. రజని గొంగటి నిర్మాతగా నూతన దర్శకుడు G.V. నాయుడు దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ కాపీ రెడీ చేసుకుని త్వరలో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ని ప్రముఖ దర్శకులు బుచ్చి బాబు సోమవారం హైదరాబాద్ లో విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ. 'CAT; ఫస్ట్ లుక్ ఆసక్తికరంగా ఉంది. డైరెక్టర్ కమ్ యాక్టర్ జి.వీ నాయుడు నాకు ఎప్పటినుంచో తెలుసు, CAT స్టోరీ కూడా నాకు చెప్పారు. వినూత్నంగా చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. థ్రిల్లర్ జోనర్ సాగే చిత్రమిది. త్వరలో విడుదలకు సిద్దమైన ఈ సినిమాని అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను' అన్నారు.