ఏమయ్యా కొరటాల.. బాలయ్యకు పెట్టే టైటిలేనా ఇది
ABN, Publish Date - May 09 , 2026 | 01:28 PM
నటసింహ బాలకృష్ణ (Nandamuri Balakrishna) 110వ చిత్రంగా వచ్చిన 'అఖండ-2' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం బాలకృష్ణ 111వ చిత్రం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రూపొందుతోంది.
నటసింహ బాలకృష్ణ (Nandamuri Balakrishna) 110వ చిత్రంగా వచ్చిన 'అఖండ-2' ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. ప్రస్తుతం బాలకృష్ణ 111వ చిత్రం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో రూపొందుతోంది. ఇక బాలయ్య 112వ చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ చిత్రాన్ని మిక్కిలినేని సుధాకర్ తమ యువసుధ ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు మే 21 తేదీన జరిపి.. రెగ్యులర్ షూటింగ్ జూలై నుండి మొదలుపెట్టనున్నారని తెలుస్తోంది...
సాధారణంగా బాలయ్య టైటిల్స్ చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. రూలర్, డిక్టేటర్, భగవంత్ కేసరి, అఖండ.. ఇలా టైటిల్ చూడగానే బాలయ్యకు కరెక్ట్ గా సూట్ అయ్యాయి అనిపిస్తుంది. అందుకే అభిమానులు సైతం అలాంటి టైటిల్సే కావాలని డైరెక్టర్స్ ని కోరుతూ ఉంటారు. అయితే ఈసారి కొరటాల మాత్రం వీటన్నింటికి విభిన్నంగా కార్పెంటర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అస్తవ్యస్తంగా ఉన్న ఓ సమాజాన్ని కథానాయకుడు పోత పోసిన శిల్పంలా తీర్చిదిద్దుతాడట. అందువల్లే ఈ చిత్రానికి కార్పెంటర్ అన్న టైటిల్ ను నిర్ణయించారనీ సమాచారం.
కథకు అనుగుణంగా పెట్టినా కూడా బాలయ్య ఫ్యాన్స్ మాత్రం.. ఏమయ్యా కొరటాల.. బాలయ్యకు పెట్టే టైటిలేనా ఇది అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ ఈ చిత్రంలో బాలయ్య సీఎంగా కనిపించనున్నాడట. అలాంటి పాత్ర అయితే మంచి పవర్ ఫుల్ టైటిల్ ని తీసుకోవచ్చుగా అని అంటున్నారు. ఇక ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూర్చడం ఖాయమని తెలుస్తోంది. జూన్ 10వ తేదీన బాలకృష్ణ పుట్టినరోజు- ఆ సందర్భంగా బాలయ్యపై ఓ సిగ్నేచర్ సాంగ్ ను అనిరుధ్ స్వరకల్పనలో రిలీజ్ చేయనున్నారట. మరి ఇందులో ఎంతవరకు నిజముంది అనేది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు ఆగాల్సిందే.