సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కార్మేని సెల్వం: డబ్బు.. కుటుంబం.. ఆధునిక ఆశయాల నేపథ్యంలో..

ABN, Publish Date - Mar 12 , 2026 | 06:46 PM

సముద్రఖని, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రలో నటిస్తోన్న ద్విభాషా చిత్రం ‘కార్మేని సెల్వం’. పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై  అరుణ్ రంగరాజులు నిర్మాతగా  రామ్ చక్రి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. లక్ష్మీ ప్రియా, అభినయ, కార్తిక్ కుమార్, బడవ గోపీ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఏప్రిల్ 3న తెలుగు, తమిళ భాషల్లో  గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ కాబోతుంది. ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ పీవీఆర్ ఐనాక్స్ ఆధ్వర్యంలో ఈ సినిమా థియేటర్స్ లోకి రాబోతుంది. గురువారం టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు. 'డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి' అని సముద్రఖని వాయిస్ ఓవర్ తో ప్రారంభమైన టీజర్ ఆసక్తి పెంచేలా ఉంది. అధిక ఖర్చులు, భారీ లోన్లు, క్రిప్టో పెట్టుబడులు, త్వరగా ధనవంతులు కావాలనే ఆశతో చేసే ప్రయత్నాలు వంటి విషయాలను వివిధ కోణాల్లో చూపిస్తూ నేటి సమాజంలో డబ్బు పట్ల ఉన్న ఆలోచనలను చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ పాత్రను గోప్యంగా ఉంచడం కూడా ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెంచుతోంది.

Updated Date - Mar 12 , 2026 | 07:53 PM