సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కాకా.. హ్యాండ్ ఇవ్వడు కదా

ABN, Publish Date - Sep 04 , 2026 | 04:32 PM

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం కాకా. వాల్తేరు వీరయ్య తరువాత ఈ బాబీ - చిరు కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

Kaaka

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం కాకా (Kaaka). వాల్తేరు వీరయ్య తరువాత ఈ బాబీ - చిరు కాంబోలో వస్తోన్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన కాకా టైటిల్ టీజర్ విశేష స్పందన తెచ్చుకుంది. ఇక కాకా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన తదుపరి కీలక, సుదీర్ఘమైన షూటింగ్ షెడ్యూల్ సెప్టెంబర్ 7 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించేందుకు టీమ్ సర్వసన్నద్ధమైంది. మేకర్స్ ఈ చిత్రాన్ని ఎలాగైనా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు.


అయితే, షూటింగ్ స్పీడ్‌గా జరుగుతున్నప్పటికీ ఈ సినిమా నిర్ణీత సమయానికి సంక్రాంతి బరిలోకి రావడం కష్టమేనని ఫిలిం నగర్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. విడుదల తేదీకి ఇంకా సమయం ఉన్నప్పటికీ, రెండు కీలకమైన పాత్రలకు సంబంధించిన నటీనటుల ఎంపిక ఇంకా పూర్తి కాకపోవడం, ప్రొడక్షన్ పరమైన సవాళ్లు, విఎఫ్ఎక్స్ పనులు ఆలస్యం అయ్యే అవకాశం ఉండటమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. వాల్తేరు వీరయ్య సెంటిమెంట్‌తో సంక్రాంతి రేసులో నిలపాలని భావిస్తున్నప్పటికీ, క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని మేకర్స్ యోచిస్తున్నట్లు సమాచారం.


ఒకవేళ కాకా సంక్రాంతి రేసు నుండి తప్పుకుంటే, ప్రత్యామ్నాయంగా ఇప్పటికే వాయిదాలు పడుతూ వస్తున్న సోషియో-ఫాంటసీ మూవీ విశ్వంభరను బరిలోకి దించాలని మెగా అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న కాకా చిత్రంలో చిరంజీవి రెండు విభిన్నమైన షేడ్స్‌లో కనిపించనుండగా, అనస్వర రాజన్, నివేతా పేతురాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కచ్చితంగా బాబీ.. సంక్రాంతి రేసులో కాకాని పెట్టడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నాతలు తెలుస్తోంది. మరి కాకా చెప్పినట్లు సంక్రాంతికి వస్తాడో.. లేక హ్యాండ్ ఇస్తాడో చూడాలి.

Updated Date - Sep 04 , 2026 | 05:55 PM