సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

'రాక': ఫస్ట్ లుక్ వచ్చాక సీన్ రివర్స్‌

ABN, Publish Date - Apr 10 , 2026 | 07:43 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. ప్రస్తుతం ఈ పేరు ఒక బ్రాండ్. పుష్ప సిరీస్‌ తో పాన్ ఇండియా వైడ్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బన్నీ, ఇప్పుడు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీతో చేతులు కలిపారు.



ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun).. ప్రస్తుతం ఈ పేరు ఒక బ్రాండ్. పుష్ప సిరీస్‌ తో (Pushpa) పాన్ ఇండియా వైడ్‌గా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన బన్నీ, ఇప్పుడు కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీతో చేతులు కలిపారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్‌మెంట్ రాగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. కానీ, తీరా ఫస్ట్ లుక్ వచ్చాక మాత్రం సీన్ రివర్స్‌ లో ఉంది. 'రాక' అంటూ వస్తున్న ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో హైప్ రావడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒక ఏఐ ఎడిటింగ్‌లా ఉన్న పోస్టర్‌తో అట్లీ ఫ్యాన్స్‌ను నిరశ పరిచారనే టాక్‌ కూడా కాస్త గట్టిగానే ఉంది.

సినిమా ఇండస్ట్రీలోనే కాదు రియల్‌ లైఫ్‌లోనూ ఒక మాట ఉంది.. "ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్". 'రాక' విషయంలో ఇదే కాస్త దెబ్బ కొట్టినట్టు కనిపిస్తోంది. అట్లీ అంటే కలర్‌ఫుల్ విజువల్స్, భారీ సెట్టింగ్స్, అదిరిపోయే ఎలివేషన్లకు పెట్టింది పేరు. కానీ బన్నీ ఫస్ట్ లుక్ చూశాక.. అది ఏదో సింపుల్‌గా ఫేస్‌బుక్ ప్రొఫైల్ ఫోటోను ఏఐ టూల్స్‌తో బీస్ట్ లుక్‌లోకి మార్చినట్లుగా ఉందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుత జనరేషన్ ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేయడం అంత ఆషామాషీ కాదు. ఒకవైపు రాజమౌళి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా లాంటి వారు పోస్టర్లతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటే, అట్లీ మాత్రం పాత పంథాలోనే వెళ్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. హైప్ ఎలా క్రియేట్ చేయాలో చెప్పడానికి ఈ ఏడాది జనవరి 1న వచ్చిన స్పిరిట్ పోస్టర్ ఒక ఉదాహరణ. ప్రభాస్ - సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన ఆ ఒక్క పోస్టర్ సోషల్ మీడియాను ఊపేసింది. అందులో ఒక రానెస్ ఉంది, ఒక ఇంటెన్సిటీ ఉంది. కానీ రాక పోస్టర్‌లో ఆ కిక్ మిస్ అయింది. పుష్ప-2 లాంటి గ్లోబల్ హిట్ తర్వాత బన్నీ నుంచి ఆడియెన్స్ ఆశించేది ఒక విజువల్ వండర్. అట్లీ తన కెరీర్‌లో రాజా రాణి నుండి జవాన్ వరకు వరుస హిట్లు కొట్టిన మాట వాస్తవమే. అయితే, ఈసారి ఆయన రెగ్యులర్ మాస్ మసాలాకు భిన్నంగా కొత్త కాన్సెప్ట్ తీసుకున్నట్లు సమాచారం. మరి ఆ కొత్తదనం పోస్టర్‌లో ఎందుకు ప్రతిబింబించలేదన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

వచ్చే ఏడాది సమ్మర్ బాక్సాఫీస్ వద్ద యుద్ధం జరగబోతోంది. ఇప్పటికే ప్రభాస్ స్పిరిట్, మహేష్‌ బాబు వారణాసి చిత్రాలు తమ బెర్త్ ఖరారు చేసుకున్నాయి. ఇప్పుడు రాక టీమ్ కూడా సమ్మర్ రేసులోనే నిలవాలని చూస్తోంది. ఒకే సీజన్‌లో ముగ్గురు పెద్ద స్టార్లు పోటీ పడుతున్నప్పుడు.. ప్రమోషన్స్ విషయంలో ఏ మాత్రం తగ్గినా భారీ నష్టం తప్పదు. రాక చిత్ర యూనిట్ ఇప్పటికైనా మేల్కొని ప్రమోషన్ల విషయంలో గేర్ మార్చాల్సిన అవసరం ఉంది. కేవలం అల్లు అర్జున్ క్రేజ్ మీద మాత్రమే ఆధారపడకుండా, కంటెంట్‌లో ఉన్న డెప్త్‌ను ఆడియెన్స్‌కు చేరవేయాలి. ఏది ఏమైనా, ఇది కేవలం ఆరంభం మాత్రమే. అట్లీకి మాస్ పల్స్ బాగా తెలుసు. బహుశా నెక్స్ట్ వచ్చే అప్‌డేట్ లేదా టీజర్‌తో మొత్తం హైప్‌ను మార్చేసే ప్లాన్‌లో ఆయన ఉండవచ్చు. ఒక సినిమా జాతకాన్ని ఒకే ఒక్క పోస్టర్ డిసైడ్ చేయలేదు. రాక నిజంగానే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Updated Date - Apr 10 , 2026 | 07:43 PM