పవన్ కల్యాణ్ ఇంటి వద్ద బిల్డర్ హల్‌చల్.. కత్తితో ఆత్మహత్యాయత్నం!
ABN, Publish Date - Nov 20 , 2026 | 05:52 AM
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసం వద్ద కలకలం చోటుచేసుకుంది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసం వద్ద కలకలం చోటుచేసుకుంది. అప్పుల బాధతో ఇబ్బందులు ఆర్థికంగా పడుతున్నానని, ఆదుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) నివాసం ఎదుట ఓ బిల్డర్ చేసిన హడావుడి కలకలం సృష్టించింది.
పోలీసుల వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా బల్లేపల్లికి చెందిన బట్టు సుచేతన్ ఠాకూర్ నాయక్ భవన నిర్మాణదారుడు. ఈ నెల 18న జూబ్లీహిల్స్ లోని పవన్ కళ్యాణ్ ఇంటి వద్దకు చేరుకున్నాడు. తన అప్పులు తీర్చేందుకు ఆర్థిక సాయం చేయాలని కోరుతూ ప్లెక్సీ ప్రదర్శిస్తూ హంగామా చేశాడు.
అక్కడే విధుల్లో ఉన్న బౌన్సర్ రాంశెట్టి రాజీవ్ కుమార్ అతడిని అడ్డుకోగా, సుచేతన్ దాడికి యత్నించాడు. అనంతరం తన వద్ద ఉన్న కత్తితో ఛాతీ, చేతులపై గాయపరుచుకుని ఆత్మహ త్యాయత్నం చేశాడు. బౌన్సర్ అతడి వద్ద కత్తిని స్వాధీనం చేసుకున్నారు. బౌన్సర్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.