మరో స్టార్ హీరోని పట్టిన బుచ్చిబాబు.. ఎవరో తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి
ABN, Publish Date - Oct 20 , 2026 | 07:21 PM
ఉప్పెన చిత్రంతో సంచలన విజయం సాధించి ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు బుచ్చిబాబు సానా (Buchibabu Sana). ఇక ఈ సినిమా తరువాత రామ్ చరణ్ తో పెద్ది సినిమాని తెరకెక్కిస్తుంటే.. ఇండస్ట్రీ హిట్ కొడతాడేమో అనుకున్నారు.
ఉప్పెన చిత్రంతో సంచలన విజయం సాధించి ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారాడు బుచ్చిబాబు సానా (Buchibabu Sana). ఇక ఈ సినిమా తరువాత రామ్ చరణ్ తో పెద్ది సినిమాని తెరకెక్కిస్తుంటే.. ఇండస్ట్రీ హిట్ కొడతాడేమో అనుకున్నారు. కానీ, ఆ అంచనాలను అన్ని తిరగరాస్తూ పెద్ది ఆశించిన ఫలితాన్ని దక్కించుకోలేకపోయింది. ఎన్నో అంచనాల నడుమ రిలీజ్ అయిన పెద్ది.. సోషల్ మీడియాలో పెద్ద ట్రోలింగ్ మెటీరియల్ గా మారింది.
ఇక పెద్ది తరువాత బుచ్చిబాబు ఏ హీరోతో సినిమా తీస్తాడు అని ఇండస్ట్రీ మొత్తం ఎంతగానో ఎదురుచూస్తుంది. గత కొన్నిరోజుల క్రితం బుచ్చి మెగాస్టార్ చిరంజీవికి ఒక కథ వినిపించడం , అది చిరుకి బాగా నచ్చడం జరిగిపోయిందని, ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు జోరుగా సాగుతున్నాయని టాక్ నడిచింది. అయితే మెగాస్టార్ లైనప్, ఇతర కమిట్మెంట్ల కారణంగా ఈ సినిమా పట్టాలెక్కడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉందిని ఈలోపు మరో స్టార్ హీరోతో బుచ్చి ఒక సినిమాని పట్టాలెక్కించనున్నాడని సమాచారం.
ఆ స్టార్ హీరో ఎవరో కాదు తమిళ హీరో సూర్య. కరుప్పు, విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలతో వరుస హిట్లను అందుకున్న సూర్యకు బుచ్చిబాబు కథ వినిపించాడని, పూర్తిగా భిన్నమైన కథాంశంతో, ఒక పవర్ పుల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. సూర్య సైతం ఈ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మించే అవకాశాలు ఉన్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ వార్త తెలియడంతో అసలు బుచ్చి ఈ రేంజ్ హీరోలను ఎలా పడుతున్నాడు.. అస్సలు సూర్యనే సినిమాకి ఒప్పించాడు అంటే ఫ్యూజులు ఎగిరిపోతున్నాయంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.