సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Buchi Babu Sana: రెండో సినిమాకు ఏ దర్శకుడికి ఇలా జరగదు..

ABN, Publish Date - Jun 02 , 2026 | 07:37 PM

నా తొలి చిత్రం ఉప్పెన బ్లాక్‌బస్టర్‌ తర్వాత దాదాపు ఐదేళ్లకు ‘పెద్ది’తో వస్తున్నా. మామూలుగా ఇండస్ట్లీర్లో పెద్ద హిట్‌ తర్వాత ఏ దర్శకుడు ఐదేళ్లు సమయం తీసుకోడు

‘ఓ సందర్భంలో పుష్ప ‘పది కేజీఎఫ్‌’లతో సమానం’ అన్నాను. అది నిజం. పుష్పరాజ్‌ మైండ్‌లో ఉంటే... పెద్ది గుండెల్లో ఉంటాడు’ అని బుచ్చి బాబు సాన అన్నారు. రామ్‌చరణ్‌ హీరోగా వెంకట సతీష్‌ కిలారు నిర్మించిన చిత్రం ‘పెద్ది’. జూన్‌ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మంగళవారం విలేకర్లతో మాట్లాడారు.

-నా తొలి చిత్రం ఉప్పెన బ్లాక్‌బస్టర్‌ తర్వాత దాదాపు ఐదేళ్లకు ‘పెద్ది’తో వస్తున్నా. మామూలుగా ఇండస్ట్లీర్లో పెద్ద హిట్‌ తర్వాత ఏ దర్శకుడు ఐదేళ్లు సమయం తీసుకోడు. కానీ నా విషయంలో అలా జరిగింది. మా గురువుసుకుమార్‌ గారు నన్ను చరణ్‌ దగ్గరకు తీసుకెళ్లారు. నేను కథ చెప్పాను. ఆయనకు నచ్చింది. ఇది జరగడానికి నాకు రెండున్నరేళ్లు పట్టింది. ఆయన కథ ఓకే చేసిన తర్వాత దాదాపు ఏడాదిన్నరలో షూటింగ్‌ మొత్తం పూర్తయ్యింది.

ఇది ఆ కథ కాదు..

క్రికెట్‌ మన అందరికీ తెలిసిన ఆటే. కానీ కుస్తీ విషయంలో ప్రత్యేక శ్రద్థ తీసుకున్నాం. దంగల్‌ చిత్రంలో అమీర్‌ ఖాన్‌ గారికి కోచింగ్‌ ఇచ్చిన ట్రైనర్‌ను తీసుకొచ్చాం. తెలంగాణలోని పహిల్వాన్లను కూడా టీమ్‌లో భాగం చేశాం. రామ్‌ చరణ్‌ గారు ఈ సినిమా కోసం దాదాపు మూడు నుంచి నాలుగు నెలలపాటు పహిల్వాన్‌ శిక్షణ తీసుకున్నారు. అయితే ఇది ఎన్టీఆర్‌ కోసం అనుకున్న కథ కాదు. ఇది చరణ్‌ కోసం రాసిన కథ. రామ్‌చరణ్‌ని కన్విన్స్‌ చేయడం అంత ఈజీగా జరగలేదు. ఆయనకు కథ నచ్చింది కాబట్టే ఒప్పుకున్నారు. కథతోనే ఆయనను కన్విన్స్‌ చేశాను. చరణ్‌కు ఎప్పటినుంచో ఒక స్పోర్ట్స్‌ డ్రామా చేయాలనే ఆసక్తి ఉంది. ఆయనకు నచ్చేలా పెద్ది కథను సిద్థం చేశాం.

హిట్‌ అవసరమే..

ఏ సినిమా సక్సెస్‌ అయినా ఇండస్ర్టీకి, డైరెక్టర్లకు, హీరోలకు, సినిమాకు పనిచేసిన అందరికీ అవసరమే. అయితే ఇప్పుడు ఆ అవసరం కాస్త గట్టిగా ఉంది. నా కెరీర్‌ మొత్తం అలానే జరిగింది (నవ్వుతూ). ఉప్పెన సమయంలో కూడా పరిస్థితి అలానే ఉండేది. అప్పట్లో అసలు థియేటర్లకు ప్రేక్షకులు వస్తారా లేదా అనే సందేహం ఉండేది. సినిమా రిలీజ్‌కు మూడు రోజుల ముందు మాత్రమే 100% ఆక్యుపెన్సీకి అనుమతి వచ్చింది. జనం థియేటర్స్‌కి వచ్చి పెద్ద హిట్‌ ఇచ్చారు.


పర్ఫెక్ట్‌గా సెట్‌ అయ్యారు..

శివరాజ్‌ కుమార్‌, జగపతిబాబు, దివ్యేందు శర్మ వీళ్లందరూ ఆయా పాత్రలకు పర్ఫెక్ట్‌గా యాప్ట్‌ అయ్యారు. శివన్న ఒక గురువుగా కనిపిస్తారు. ఆటను బ్రతికించేవాడి పాత్ర అది. అలాగే జగపతిబాబు అప్పలసూరి పాత్ర చాలా బరువైనది. హీరో తర్వాత అంత పవర్‌ఫుల్‌గా ఉండే పాత్ర అది. దివ్యేందు పాత్ర కూడా క్రేజీగా ఉంటుంది. జాన్వీకపూర్‌ సినిమాకు స్పెషల్‌ కలర్‌ తీసుకొచ్చారు. లవ్‌ ట్రాక్‌ చాలా బాగుంటారు. జాన్వీ చాలా తెలివైన అమ్మాయి. చాలా డెడికేటెడ్‌ పర్సన్‌. సినిమాపై చాలా పాషన్‌ ఎక్కువ. వినయంగా ఉంటుంది.

మరో ఆప్షన్‌ తీసుకోలేదు..

నాకు రోజా, బొంబాయి.. నుంచి రెహమాన్‌ గారి ఆల్బమ్స్‌ చాలా ఇష్టం. ఆయనతో పనిచేయాలనేది నా కోరిక. ఇలా కుదిరింది. ఆయన స్వయంగా పాడుతుంటే వింటూ చాలా ఎంజాయ్‌ చేశాను. లైఫ్‌ లాంగ్‌ ఆయనతో సినిమాలు చేయాలని ఫిక్స్‌ అయిపోయాను. ఇందులో అబ్బనీ తీయని దెబ్బ సాంగ్‌ ఉంది. అది రేడియోలో మాత్రమే వినిపిస్తుంది. అది వచ్చినప్పుడు ప్రేక్షకుల కథ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని భావించి మ్యూట్‌ చేేసశాం. ఈ సినిమాలో ఇంకా రెండు పాటలున్నాయి. అవి కూడా అదిరిపోతాయి. ‘మస్సా మస్సా’ పాట తయారయ్యాక ఎవరికీ వినిపించలేదు. మరో ఆప్షన్‌ కావాలని అడిగాను. ఒకరోజు చరణ్‌ గారు కారులో వెళ్తూ ఆ పాట విన్నారు. ఆయనకు చాలా నచ్చింది. అదిరిపోయింది అన్నారు. తర్వాత మరో ఆప్షన్‌ తీసుకోలేదు. అది చరణ్‌ గారి జడ్జ్‌మెంట్‌.

భయమేసింది..

షూటింగ్‌లో చరణ్‌ గారికి చాలా గాయాలయ్యాయి. ముఖ్యంగా రెజ్లింగ్‌ సన్నివేశాల్లో దెబ్బలు తగిలాయి. కంటికి గాయం అయ్యి రక్తం కారినప్పుడు మాత్రం చిరంజీవి గారు తిడతారేమో అని భయమేసింది. అది కెమెరాలో కూడా రికార్డ్‌ అయింది. ఒక ఫైట్‌ సీన్‌ లో పొరపాటున తగిలింది. అయితే చిరంజీవి గారు ‘‘బుచ్చి వీడియో పంపించు’ అన్నారు.


మైండ్‌బ్లోయింగ్‌..

పెద్ది జర్నీని మూడు దశలుగా విభజించాం. ప్రతి దశకు లుక్‌ ఎలా ఉండాలో ఏఐలో డిజైన్‌ చేసి ఆయన దగ్గరకు తీసుకెళ్లాను. నేను డిజైన్‌ చేసిన దానికంటే ఇంకా అద్భుతంగా ట్రాన్స్‌ఫార్మ్‌ అయ్యారు. ఆయన ట్రాన్స్‌ఫార్మేషన్‌ మైండ్‌బ్లోయింగ్‌గా అనిపించింది. ఒక కమర్షియల్‌ హీరోను ఆర్గానిక్‌గా చూపించడం కత్తి మీద సాము లాంటిది. కే్ౖలమాక్స్‌ ఎలా ఉంటుందో మీరు బిగ్‌ స్క్రీన్ పైౖ చూసి అనుభవించాలి. ఇప్పటివరకు చూసినవాళ్లంతా ఎక్స్‌ట్రార్డినరీగా ఉందని అన్నారు. ఈ సినిమాలో స్పోర్ట్స్‌ ఎమోషన్‌తోపాటు బ్యాక్‌డ్రాప్‌లో చాలా పెద్ద కథ ఉంటుంది. ఒక 15 నిమిషాలు మెయిన్‌ ఎమోషనల్‌ బ్లాక్‌ ఉంది. దాన్ని ఇంకా రివీల్‌ చేయలేదు. ఫైనల్‌ కాపీ చూసుకున్నాక మంచి సినిమా తీశాననే ఫీలింగ్‌ కలిగింది. సుకుమార్‌ ఒక సినిమా చేస్తున్నప్పుడు పూర్తిగా అదే సినిమా గురించే ఆలోచిస్తారు. ఇంకో ఆలోచన ఉండదు. పెద్ది చూసిన తర్వాత సెకండాఫ్‌ తన ఫేవరెట్‌ అని చెప్పారు.

పెద్ది మాత్రమే కనిపిస్తాడు

పెద్ది గురించి ఒక మాటల్లో చెప్పాలంటే.. ఫ్యామిలీతో కలిసి వెళ్లి హ్యాపీగా చూడండి. సూపర్‌గా, చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. కమర్షియల్‌ అంశాలు ఉంటాయి. పాత్రలో చరణ్‌ గారు కనిపించరు... పెద్ది మాత్రమే కనిపిస్తాడు. పెద్ది ఆట నుంచి ఏం నేర్చుకున్నాడు, ఆ ఆట అతనికి ఏమిచ్చింది అనేది ప్రతి ఒక్కరికీ కనెక్ట్‌ అవుతుంది.

ఎన్టీఆర్‌ పిలిస్తే..

చిరంజీవిగారు ఇంకా సినిమా చూడలేదు. ఎప్పుడు చూస్తారా అని ఎదురుచూస్తున్నాను. సురేఖ మేడమ్‌ ఒక సీక్వెన్స్‌ చూశారు. చాలా ఎమోషనల్‌ అయ్యారు. ప్రస్తుతం ఒక మంచి కథ సిద్థంగా ఉంది. ఎవరితో చేస్తాననేది తర్వాత చూద్దాం. ఎన్టీఆర్‌ గారు పిలిస్తే మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్లి కథ చెబుతాను.

Updated Date - Jun 02 , 2026 | 07:43 PM