సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Buchi Babu Sana: మహేశ్‌తో సినిమా.. బుచ్చిబాబు రియాక్షన్‌ ఇదే!

ABN, Publish Date - Jun 15 , 2026 | 04:21 PM

తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్నారు బుచ్చిబాబు సానా (Buchibabu Sana). రెండో చిత్రానికి రామ్‌చరణ్‌తో (Ram charan) అవకాశం అందుకున్నారు.

Buchi Babu sana

తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్‌ అందుకున్నారు బుచ్చిబాబు సానా (Buchibabu Sana). రెండో చిత్రానికి రామ్‌చరణ్‌తో (Ram charan) అవకాశం అందుకున్నారు. దీంతో ద్వితీయ విఘ్నం నుంచి గట్టెక్కారు. ఇప్పుడు మూడో చిత్రం ఎవరితో అనేది సస్పెన్స్‌లో ఉంది. ప్రస్తుతం ఆయన పెద్ది’ సక్సెస్‌ను ఆస్వాదిస్తున్నారు. మరోపక్క తదుపరి చిత్రం ఎవరితో అనే చర్చ మొదలైంది. ‘పెద్ది’కి ముందు ఎన్టీఆర్‌తో ఓ చిత్రం అనుకున్నారు. అది సెట్‌ కాలేదు. ఆ కథను పక్కనపెట్టి ‘పెద్ది’ కోసం మరో కథ సిద్ధం చేశారు. ప్రస్తుతం తారక్‌ డ్రాగన్‌ సినిమాతో బిజీగా ఉన్నారు. చిరంజీవిని ఓ ఆఫర్‌ ఇవ్వమని నేరుగా అడిగేశారు బుచ్చి. ప్రస్తుతం ఆయన చేతిలో రెండు చిత్రాలున్నాయి. అయితే తదుపరి చిత్రం మహేశ్‌బాబుతో (Mahesh) అని, మైథలాజికల్‌ కథ అని టాక్‌ నడుస్తోంది.

ఇదే విషయాన్ని బుచ్చిని అడగగా, దానికి ఇంకా సమయం ఉంది. ఏదైనా టైమ్‌ నిర్ణయిస్తుంది. రాసుకున్న కథకు చక్కని ఎంటర్‌టైన్‌మెంట్‌ జోడించి ఓ మంచి పాయింట్‌ చెప్పాలనుకునే దర్శకులు ఇండస్ర్టీలో చాలామంది ఉంటారు. అందులో నేను ఒకడినని భావిస్తా. ఏ మేకర్‌ అయినా సినిమా ద్వారా ఓ మంచి పాయింట్‌ చెప్పాలనుకుంటారు అయితే ఈసారి మంచి చెప్పాలనుకోవడం లేదు. సినిమా ప్రారంభం నుంచి కమర్షియల్‌ ఎలిమెంట్స్‌తోనే ఉంటుంది’ అని బుచ్చిబాబు చెప్పారు.

Updated Date - Jun 15 , 2026 | 04:26 PM