సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సుదర్శన్ థియేటర్‌లో ‘ది ప్యారడైజ్’ వీక్షించిన కేటీఆర్.. ఏమన్నారంటే?

ABN, Publish Date - Sep 27 , 2026 | 08:27 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌ సుదర్శన్ థియేటర్ ‘ది ప్యారడైజ్’ చిత్రాన్ని వీక్షించి చిత్రబృందాన్ని అభినందించారు.

ktr the paradise

నేచురల్ స్టార్ నాని (Nani) హీరోగా, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్’ (The Paradise) సినిమా ఇటీవ‌లే విడుదలై థియేట‌ర్ల‌లో విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. ముఖ్యంగా సెకండాఫ్‌లో వ‌చ్చే శంక‌ర‌న్న పాత్ర సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలిచింది. మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను గుర్తు చేస్తూ సాగిన ఈ క్యారెక్ట‌ర్ ప్రేక్షకుల నుంచి భారీ స్పందనను అందుకుంటోంది. ఈ క్ర‌మంలో తాజాగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్‌ సుదర్శన్ థియేటర్ (Sudarshan Theatre)లో పార్టీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఈ చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శనలో వీక్షించి చిత్రబృందాన్ని అభినందించారు.

అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.. తెలంగాణ నేల, భాష, సంస్కృతిని అద్భుతంగా ఆవిష్కరించిన దృశ్య కావ్యం. "సమాజంలో అణచివేత ఎదురైనప్పుడు ఆ సమాజం తన అస్తిత్వం కోసం చేసే పోరాటం, న్యాయం కోసం గళమెత్తే తీరును ఈ చిత్రంలో అద్భుతంగా చూపించారు. అణచివేతకు గురైన ప్రజల పక్షాన ఒక నాయకుడు నిలబడి, ఆ సమాజాన్ని ఎలా ముందుండి నడిపించాడో చక్కటి కథాంశంతో ఆవిష్కరించారు.

ఈ అస్తిత్వ పోరాటానికి అద్భుతమైన దృశ్యరూపం ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల గారికి, హీరో సోదరుడు నాని గారికి, అలాగే చిత్ర నిర్మాణ బృందానికి నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తెలంగాణ నేల నేపథ్యంలో, సహజసిద్ధమైన తెలంగాణ యాస, భాషలతో తెరకెక్కించిన ఈ చిత్రం ఒక గొప్ప కావ్యంలా సాగింది. అణచివేతకు గురైనప్పుడు ప్రజలు ఏ విధంగా తిరగబడతారో చూపిస్తూ సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు.

ఈ సినిమా నేపథ్యం, ఇందులో చూపించిన పోరాటానికి అసలైన ప్రేరణ ఎవరో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు, అది అందరికీ ఇప్పటికే అర్థమైపోయింది.ష‌ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, చారిత్రక పోరాట స్ఫూర్తిని ప్రతిబింబించేలా సినిమాను తెరకెక్కించిన చిత్ర యూనిట్‌ను కేటీఆర్ గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Sep 27 , 2026 | 09:28 AM